»   » పూరి-ఛార్మి ‘జ్యోతి లక్ష్మి’ రిలీజ్ డేట్ లాక్

పూరి-ఛార్మి ‘జ్యోతి లక్ష్మి’ రిలీజ్ డేట్ లాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్ పై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జ్యోతి లక్ష్మీ'.

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఛార్మి హీరోయిన్‌గా ‘జ్యోతి లక్ష్మీ' పేరుతో సినిమా చెయ్యబోతున్నామని దర్శకనిర్మాతలు ఎనౌన్స్ చెయ్యడంతోనే ఈ సినిమా మీద అందరికీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసారో ఆడియన్స్ లో అప్పటి వరకు ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ రెట్టింపు అయ్యాయి.

బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాగా ‘జ్యోతి లక్ష్మి' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 12న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Jyothi Lakshmi

ఈ సందర్భంగా సి.కె.ఎంటర్టెన్మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ మాట్లాడుతూ..‘మా ‘జ్యోతి లక్ష్మీ' చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కి చాలా మంచి స్పందన వస్తోంది. బిజినెస్ పరంగా కూడా మే చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ని ఏరియాల నుండి చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతాన్నందించారు. జూన్ 4న ఈ చిత్రం ఆడియోను చాలా డిఫరెంటుగా రిలీజ్ చేయబోతున్నాం. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ చాలా డిఫెంటుగా తెరకెక్కించారు.

పూరి కెరీర్లో తప్పకుండా ఈ సినిమా ఒక డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుంది. అలాగే ఛార్మి ఇప్పటి వరకు చేయని ఒక ఛాలెంజింగ్ రోల్ ఈ సినిమాలో చేసింది. ఛార్మి కెరీర్లో ‘జ్యోతి లక్ష్మీ' అనే సినిమా ఒక మరపురాని చిత్రంగా అందరి ప్రశంసలు అందుకుంటింది అని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Charmi starrer 'Jyothi Lakshmi' will be released on June 12th. Audio Launch of this women-centric flick is scheduled to take place on June 4th.
Please Wait while comments are loading...