»   » యూట్యూబ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సీక్రెట్స్ ... (వీడియో)

యూట్యూబ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సీక్రెట్స్ ... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు...తన సినీ కెరీర్ లో తెలుసుకున్న ఎన్నో విషయాలను, సీక్రెట్స్ ను తర్వాత తరానికి అందచేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ లో పాఠాలు చెప్పబోతున్నారు.

దర్శకత్వం నేర్చుకోవాలి...అదీ రాఘవేంద్రరావు వంటి గొప్ప దర్శకుడు వద్ద అనుకున్నవారందరికీ అది ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోవచ్చు. అలా డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉన్నవారికి పాఠాలు నేర్పిస్తానంటున్నారు. అందుకోసం మీరు ఏ రకమైన ఫీజులు చెల్లించనవసరం లేదు

K Raghavendra Rao's Classroom on Youtube!

కె.ఆర్.ఆర్.క్లాస్ రూమ్..ప్రాక్టికల్ ఇన్ ఫిలిమ్ డైరెక్షన్ అంటూ త్వరలో యూట్యూబ్‌లో దర్శకేంద్రుడు క్లాస్‌లు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధిచిన ప్రమోషన్ వీడియోను, పోస్టర్‌ను తన ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేశారు. మరి ఇంకెందుకు యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి ఆయన సక్సెస్ సీక్రెట్స్ తీసుకుని ఫాలో అయిపోండి.

నాగార్జున త్వరలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ..వెంకటేశ్వరస్వామి పరమ భక్తుడు 'హాథీరాం బాబా'గా కనిపించనున్నాడు. శిరిడి సాయి సినిమా తరువాత ఇంతవరకు దర్శకుడు రాఘవేంద్రరావు మరో సినిమాను ప్రారంభించలేదు.

K Raghavendra Rao's Classroom on Youtube!

వెంకటేశ్వర స్వామి కథతో ఓ సినిమా చేస్తున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించినా, నాగార్జున డేట్స్ కాళీ లేకపోవటంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు.
సోగ్గాడే చిన్నినాయనా తరువాత మరో సినిమా అంగీకరించని నాగ్, రాఘవేంద్రరావు దర్శకత్వంలో హాథీరాం బాబాగా నటించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

English summary
K Raghavendra Rao tweeted: "Classes starting soon! Stay tuned!". Aspiring Filmmaker could learn so much from the experience and insights shared by KRR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu