For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR Story: కథ లీక్ చేసిన రాజమౌళి తండ్రి.. రిలీజ్ ముందు రోజే బయటకొచ్చిన హైలైట్స్

  |

  'బాహుబలి' సిరీస్‌తో దేశం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అంతేకాదు, తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి కూడా పరిచయం చేశాడు. అప్పటి నుంచే టాలీవుడ్‌కు మరింత ఎక్కువ గుర్తింపు దక్కుతుందని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా సక్సెస్ తర్వాత దర్శకధీరుడు తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). బిగ్ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో దీని రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక, భారీ అంచనాల నడుమ మార్చి 25న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్టోరీలైన్‌ను ప్రముఖ రైటర్ లీక్ చేశారు. ఆ సంగతులు మీకోసం!

  ఇండియాలోనే బిగ్ మూవీగా RRR

  ఇండియాలోనే బిగ్ మూవీగా RRR


  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో నటించారు. ఇది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

  Bigg Boss Non Stop: కెమెరా ముందే ఆరియానా అందాల ఆరబోత.. ఫాలో అవండంటూ టాప్ విప్పేసి మరీ!

  రికార్డులు.. అంచనాలు భారీగానే

  రికార్డులు.. అంచనాలు భారీగానే

  ఆరంభం నుంచే RRR మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా స్పందన దక్కింది. అలాగే, ఈ చిత్రంలోని పాటకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు నమోదవడంతో పాటు అంచనాలు రెట్టింపయ్యాయి.

  కలిసొచ్చేలా నిర్ణయాలు.. ఫుల్‌గా

  కలిసొచ్చేలా నిర్ణయాలు.. ఫుల్‌గా

  కొంత కాలంగా టాలీవుడ్‌లో టికెట్ రేట్ల తగ్గింపు అనే అంశం పెద్ద సమస్యగా మారిన విషయం తెలిసిందే. అయితే, RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ విషయంలో ఆ అడ్డంకులు తొలిగిపోయాయి. ఏపీలో రేట్లు పెంచుకునే వెసలుబాటును ప్రభుత్వం కల్పించింది. అలాగే, చాలా ఏరియాల్లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా.. అన్ని చోట్ల ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన కాజల్: ప్రెగ్నెంట్ అయినా అందాలు ఆరబోస్తూ ఘాటుగా!

  ప్రమోషన్ ఈవెంట్స్.. ఫుల్ బిజీ

  ప్రమోషన్ ఈవెంట్స్.. ఫుల్ బిజీ

  RRR (రౌద్రం రణం రుధిరం) శుక్రవారమే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను విస్తృతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను నిర్వహించగా.. ఉత్తరాదిలోనూ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలు కలిసి పర్యటనలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అలాగే, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మొత్తానికి దీన్ని ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు.

  ఆయన మిస్సింగ్.. ఇంటర్వ్యూ

  ఆయన మిస్సింగ్.. ఇంటర్వ్యూ

  RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి సంబంధించిన హడావిడి ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు పది రోజులుగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. అయితే, ఇందులో రైటర్ విజయేంద్ర ప్రసాద్ కనిపించలేదు. దీంతో ఇది ఒక చర్చనీయాంశం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆయన కొన్ని న్యూస్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

  Sonam Kapoor Pregnant: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. భర్త మీద పడుకుని.. హాట్ ఫొటోను వదిలి!

  స్టోరీలైన్ లీక్ చేసేసిన రచయిత

  స్టోరీలైన్ లీక్ చేసేసిన రచయిత


  RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘ఈ కథలో రామ్ చరణ్‌, తారక్‌లు ఇద్దరూ ప్రాణ మిత్రులు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత మంచి స్నేహితులు. కానీ.. ఈ కథలో వీళ్లిద్దరి ఐడియాలజీ వేరు. సినిమా మొదట్లోనే ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధృవాలు అన్న విషయం తెలుస్తుంది' అని లైన్ లీక్ చేశారు.

  Recommended Video

  Kannadigas Angry With RRR Movie..తప్పెవరిది ? | RRR Vs KGF 2 | Filmibeat Telugu
  హైలైట్ కూడా రివీల్ చేసేశారు

  హైలైట్ కూడా రివీల్ చేసేశారు

  ఈ చిట్‌చాట్‌లో విజయేంద్ర ప్రసాద్ ‘హీరోలిద్దరూ వేరు వేరు స్వభావాలు ఉన్న వాళ్లు కావడంతో వీళ్లకు వస్తుందని మనకు అర్థం అవుతుంది. అప్పుడలా జరగకూడదని ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ, ఇంటర్వెల్ ముందు ఇద్దరూ సింహాల్లా దెబ్బలాడతారు. అది చూస్తే మనకు ఏడుపు వస్తుంది' అని రివీల్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తెల్లవాళ్లపై పోరాటం చేస్తారన్న మాట.

  English summary
  Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. Recently K. V. Vijayendra Prasad Revealed This Movie Storyline.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X