twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ రజనీ, ఏ టీజర్ కు ఇండియాలో ఈ స్దాయి వ్యూస్ రాలేదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొన్న 1 వ తేదిన రజనీ తాజా చిత్రం 'కబాలి' సినిమా టీజర్‌ విడుదలైంది. రిలీజైన నాటినుంచీ యూట్యూబ్‌లో ఈ టీజర్‌ రికార్డుల మోతమోగిస్తుంది. ఇప్పటివరకూ కబాలి టీజర్‌ను చూసిన వారి సంఖ్య కోటి దాటేసింది.

    భారతీయ చిత్రాల్లో ఏ టీజర్‌కు ఇప్పటివరకూ ఈ స్థాయి స్పందన రాలేదు అని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం 66 సెకన్ల ఈ టీజర్‌లో వయసైపోయిన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ చెప్పిన డైలాగు ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

    Kabali creates record with 1.20 Cr views

    అలాగేటీజర్‌ చివర్లో యువకుడిగా కనిపించి అలరించారు రజనీ. పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్‌ సినిమా అంటే తమిళనాటే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. అందుకే ఈ స్దాయిలో స్పందన వస్తోంది.

    ఈ చిత్రం తెలుగు,తమిళ వెర్షన్స్ రెండూ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయంచారు. ఈ మేరకు వదిలిన టీజర్స్ సైతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

    మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గా తెల్లని గెడ్డంతో రజినీకాంత్ తనదైన శైలిలో చాల విభిన్నంగా స్టైలిష్ గా కనిపించి అభిమానులకు పండుగ చేసారు. రజినీకాంత్ స్టైలిష్ నడకతో ఈ టీజర్ ప్రారంభమైంది.

    ముఖ్యంగా 'పాత తెలుగు చిత్రాల్లో బుగ్గపై గాటు పెట్టుకుని, మీసాలు తిప్పుకొంటూ, లుంగీ కట్టుకుని పాత విలన్‌ ఏయ్‌! కబాలి అని పిలవగానే... వంగుని వినయంగా ఎస్‌ బాస్‌ అంటూ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నావా?.. కబాలి... రా' అంటూ చెప్పిన డైలాగ్‌ అదరగొట్టిందంటున్నారు ఫ్యాన్స్.

    మరోపక్క ఆదివారం ఉదయం విడుదల చేసిన కబాలి త‌మిళ‌ టీజర్‌కు గంటలోనే మిలియన్‌ వ్యూస్‌ వచ్చేశాయి. అంతేకాకుండా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని అందరు ప్రముఖులు రజనీ స్టైల్‌కు ఫిదా అయిపోయారు.

    ఈ చిత్రంలో రజనీకాంత్‌కి జోడీగా రాధికా ఆప్టే నటించారు. కలైపులి ఎస్‌. థను నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ధన్షిక, కిషోర్‌, దినేష్‌ రవి, జాన్‌ విజయ్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. చైనాకు చెందిన విల్సన్‌ చౌ విలన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం మలేసియాలో జరిగింది.

    నిర్మాత మాట్లాడుతూ ''తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న చిత్రిమిది. సంతోష్‌ నారాయణ్‌ బాణీలు అందిస్తున్నారు. తెలుగులో సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌ సాహిత్యాన్ని అందిస్తున్నారు''అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాహితి, ఛాయాగ్రహణం:మురళీ, కళ: రామలింగం.

    English summary
    Rajanikanth's upcoming film Kabali teaser’s view has crossed 1 Cr. This is a phenomenal record.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X