»   » "కబాలి " చేయటం పెద్ద అదృష్టమేం కాదు: పా.రంజిత్

"కబాలి " చేయటం పెద్ద అదృష్టమేం కాదు: పా.రంజిత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పా.రంజిత్ ఇప్పటివరకూ చేసినవి రెండే రెండు సినిమాలు.. మూడో చిత్రానికే సూపర్‌స్టార్‌‌ రజనీకాంత్‌ని దర్శకత్వం వహించే ఛాన్స్ సంపాదించి అగ్రదర్శకులకు సైతం షాక్‌ ఇచ్చాడీ యువ దర్శకుడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలలో ప్రతీ డైరెక్టర్ కీ రజినీకాత్ తో సినిమా అవకాసం రావటం ఒక స్థాయి గౌరవంగా..., అవకాశం గా భావిస్తారు... తమకు దక్కిన అదృష్టంగానే అంతా అనుకుంటారు. కానీ రంజిత్ మాత్రం ఇది అదృష్టం కాదంటున్నాడు. కష్టాన్ని మాత్రమే నమ్మటం వచ్చిన అతను ఏదో గాలివాటుగా వచ్చే అదృష్టం అనే మాటని అంగీకరించటం లేదు...

"మూడో సినిమాకే రజనీకాంత్‌ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్ రావడం అదృష్టమంటున్నారు. మీ అభిప్రాయం?" అన్న ప్రశ్నకు సమాధానం గా "అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. కష్టాన్నే నమ్ముతాను. నా కష్టానికి తగ్గ ఫలితంగానే భావిస్తున్నా." అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పాడతను. స్టార్ హీరోలతో పని చేయడం గురించి దర్శకులు మామూలుగా వారిని ఆకాశానికెత్తేస్తూ ఇది అదృష్టం గా భావిస్తున్నాను..., ఇది దేవుడిచ్చిబ్న అవకాశం అంటూ చెప్పే మాటలేవీ ఇతను చెప్పలేదు.


Kabali Director About Rajinikanth Moveie

కేవలం తన పనినీ.., శ్రమనీ మాత్రమే నమ్మిన ఆత్మవిశ్వాసం తోనే ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నానని చెబుతున్నాడు.అలాంటిది రజినీ లాంటి సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం విషయంలో రంజిత్ ఎంత ముక్కుసూటిగా మాట్లాడాడో చూశారా? రంజిత్‌కు రజినీకాంత్ ఎందుకు అవకాశమిచ్చాడో ఈ మాటల్ని బట్టే అర్థమైపోతుంది.


'రజనీ సార్‌ నటన గత సినిమాల కంటే వైవిధ్యంగా ఉంటుంది. అందుకు కావాల్సిన అద్భుతమైన సందర్భాలు ఈ కథలో వున్నాయి. కోపం, సంతోషం లేదా బాధ లాంటి భావోద్వేగాలను రజనీ పండించిన తీరు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. సూపర్‌స్టార్‌ను ఎంత మాస్‌గా చూస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తారో ఆ స్థాయిలో 'కబాలి' ఉంటుంది'' అని చెప్పాడు.

English summary
"Movie With Rajinikanth is not luck it is a Result of my won Efforts" says Pa.ranjit Who is Director of Rajini's New Movie "kabali"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu