»   » టికెట్లు దొరకలేదు: రజనీకాంత్ అభిమాని ఆత్మహత్య? (వీడియో)

టికెట్లు దొరకలేదు: రజనీకాంత్ అభిమాని ఆత్మహత్య? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలేషియా: సూపర్ స్టార్ల సినిమాలు విడుదల సమయంలో భారీ హడావుడి జరుగడం మామూలే. కొన్ని సార్లు కొన్ని ప్రమాదాలు, విషాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమా ఒకరి ప్రాణాలు పోవడానికి పరోక్షంగా కారణమైనట్లు తెలుస్తోంది.

కబాలి సినిమా తొలి షోకు టిక్కెట్లు లభించలేదన్న మనస్థాపంతో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. మలేషియాలోని కేన్‌సిసీలో ఈ సంఘటన జరిగింది. పది అంతస్తుల భవనం నుంచి కిందకు దూకి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని ఆతసుపత్రికి తరలించారు. చివరకు అతడు ఆసుపత్రిలో మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.


టికెట్లు థియేటర్ల వద్ద మాత్రమే అమ్మే రోజుల్లో అభిమానులు టిక్కెట్ల కోసం తీవ్రంగా పోటీ పడేవారు. ఈ క్రమంలో తొక్కిసలాటలు జరిగి అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సందర్బాలు అనేకం. అయితే ఇప్పుడంతా ఆన్‌లైన్ కావడంతో ఇలాంటి సంఘటనలు తగ్గాయి.


ఆన్ లైన్లో టికెట్ బుకింగ్ ప్రారంభం అయిన క్షణాల్లో టికెట్లు అమ్ముడు పోతున్నాయి. అయితే ఇంటర్నెట్ అందుబాటులో లేని వారు, ఆ సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియని వారికి టిక్కెట్లు దొరకడం లేదు. దీంతో తొలి రోజు, తొలి షో చూడాలనుకునే రజనీ అభిమానులకు నిరాశే మిగులుతోంది.


పరువు సమస్యగా..

పరువు సమస్యగా..

కొందరు అభిమానులు మొదటి షో తప్పకుండా చూడాలని ఎంతకైనా తెగిస్తున్నారు. మొదటి రోజునే ఈ సినిమా చూడలేకపోతే బంధుమిత్రుల్లో అదొక అవమానంగా, పరువు సమస్యగా భావిస్తున్నారు.


ఆత్మహత్యకు కారణం అదేనా?

ఆత్మహత్యకు కారణం అదేనా?

తాజాగా టిక్కెట్టు దొరకని అభిమాని ఆత్మహత్య కు పాల్పడటానికి కారణం అదే అని తెలుస్తోంది.


భారీ లాబీయింగ్

భారీ లాబీయింగ్

కబాలి టిక్కెట్ల కోసం తమిళనాడు, కర్ణాటకల్లో భారీ లాబీయింగ్ జరుగుతోంది. టికెట్ల కోసం మంత్రుల వరకు ఫోన్లు వెలుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


హడల్

హడల్

తమిళనాడులో రాజకీయ నేతలంతా ఫోన్లు మ్రోగితే చాలు హడలి పోతున్నారట. తొలి షో టికెట్ల కోసం కార్యకర్తలు, ప్రజల, సన్నిహితుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఉందట.


వీడియో

రజనీకాంత్ అభిమాని సూసైడ్ అటెంమ్ట్ చేస్తున్న వీడియో


English summary
Kabali Film fan suicide attempt in malaysia. He jumped from top of the building, coz he didnt get kabali ticket.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu