Just In
- 14 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ద్యావుడా..! కబాలి... అన్న పేరు వెనకే ఇంత కథ ఉందా...?
సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటించిన 'కబాలి' సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రజనికాంత్ కు భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన సినిమాకోసం ఫ్యాన్స్ జోరుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా అమెరికాలో 400 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఒక రోజు ముందే అంటే 21 న ఉందయం విడుదల అవుతుంది. కబాలి సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేసిన రెండు గంటల్లోనే ఉన్న టికెట్స్ మొత్తం అయిపోయాయట !! ఇప్పటి వరకు కేవలం రెండు గంటల్లోనే టికెట్స్ అయిపోవడం ఇదే మొదటిసారని అంటున్నారు. ఇక ఈ సినిమా బాహుబలి రికార్డ్ ను బద్దలు కొడుతుందని ప్రచారం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 7000 థియేటర్స్ లో విడుదల అవుతుందట !! మొత్తానికి హిందీ , తెలుగు, తమిళ కబాలి హంగామా మాములుగా లేదు.
ఈ పేరు మీదే అందరి ఆసక్తి. కబాలీ అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు పెట్టారు? దాని అర్థం ఏమిటి? ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా దీనిపైనే చర్చ. మరోపక్క, ఈ చిత్రం విడుదలకు ముందే రాష్ట్రం దేశం, ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయి కూర్చుంది. సోషల్ మీడియాలో అయితే చెప్పనే అక్కర్లేదు. ఈ చిత్రం గురించి చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇక, ఈ చిత్రం ప్రచారంలో సరికొత్త మార్గాల్లో నడుస్తోంది. విమానాల పై , సిమ్ కార్డుల పై కూడా కబాలి కనిపిస్తున్నాడు.అయితే కబాలి అనే మాటకు అర్థం ఏమిటో చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు.
చెన్నైకి శివారు ప్రాంతంలో ఉన్న మైలాపూర్ లో కాపాలీశ్వర్ ఆలయం ఉంది. శివపార్వతులకి ఈ ఆలయం అంకితమివ్వబడినది. ఈ ఆలయంలో 'కర్పగంబాల్' లేదా 'కోరికలను తీర్చే దేవత' రూపం లో పార్వతీ దేవిని కొలుస్తారు.కపాలం' అంటే తల, శివుని మరో పేరు అయిన 'ఈశ్వర్' రెండు పదాల నుండి ఈ ఆలయం పేరు ని గమనించవచ్చు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు అలాగే శివుడు కైలాస పర్వతం వద్ద కలసుకున్నప్పుడు శివుని గొప్పదనాన్ని బ్రహ్మ గుర్తించలేదన్న కోపం తో బ్రహ్మ యొక్క నాలుగు తల ల లో ఒక తలని బలం గా లాగివేస్తాడు. ఆ తప్పుని సరిదిద్దుకునేందుకు బ్రహ్మ దేవుడు మైలాపూర్ కి వచ్చి ఒక శివ లింగాన్ని స్థాపిస్తాడు.

పల్లవ రాజులచే 7 వ శతాబ్దం లో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని నమ్ముతారు. ద్రావిడ నిర్మాణ శైలి లో ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ప్రస్తుతం సాంతోం చర్చ్ ఉన్న ప్రాంతం లో అసలైన ఆలయం ఉండేదని అంటారు. పోర్టుగీసు చేత ఆ ఆలయం ద్వంసం చేయబడిన తరువాత 16 వ శతాబ్దం లో విజయనగర రాజులూ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఉండే అనేకులు పూజించే తమ ఇష్టదైవమైన కపాలీశ్వరుడి పేరుని తమ పిల్లలకి పెట్టటస్మ్ సాధారణం....
ఈ పదానికి అసలు రూపం 'కపాలి'. ఇది ఒరిజినల్‌గా సంస్కృత పదం. కపాలం అంటే పుర్రె! 'కాపాలికుడు' అనే పదం తెలుగులో వాడుకలో ఉంది. పూర్వం పాత సినిమాల్లో విలన్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడే 'యస్ బాస్' పాత్రలకు 'కపాలి' అని పేరు పెట్టేవారు. త్యాగరాజు, భీమరాజు, ఆనందమోహన్ వంటి అలనాటి 'రౌడీ' వేషగాళ్లు ఆ పాత్రను పోషించేవారు. ఇప్పుడు 'కబాలి' సినిమా టైటిల్ కూడా అదే! ''విలన్ దగ్గర చేతులు కట్టుకుని వాడు చెప్పిందల్లా చేస్తూ పడిఉండే కబాలిని అనుకున్నావా? నేను అలాంటివాణ్ని కాదు'' అనే అర్థంలో రజనీకాంత్ చెప్పిన ఓ తమిళ డైలాగ్ ఇప్పటికే అన్ని మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. అయితే తమిళంలో 'ప' అనే శబ్దానికి ప్రత్యేకంగా ఓ అక్షరం లేకపోవడం వల్ల 'కపాలి' అనే పదం 'కబాలి'గా మారింది.
చెన్నైలోని మైలాపూర్ లో ప్రసిద్ధిచెందిన కపాలీశ్వర స్వామి వారి దేవాలయం ఉంది .శివుడిని కపాలి అని కూడా అంటారు!తమిళులు 'ప'ను 'బ'గా పలుకుతారు అలా కపాలి తమిలం లో "కబాలి" అయ్యాడన్న మాట. చెన్నై లోని మైలాపూర్ లో ఒకప్పుడు కబాలి అనే పేరుగల డాన్ ఉండేవాడట. ఆ డాన్ ని దృష్టిలో పెట్టుకొనే రజినీ పాత్రకి కబాలి అనే పేరు పెట్టారు. కానీ కథకూ ఆ డాన్ కబాలీశ్వరన్ కూ ఏ సంబందమూ లేదు.తెలుగు టైటిల్ మహాదేవగా మొదట్లో ప్రచారం జరిగినా కబాలి అనే పేరుకి ప్రచారం బాగుండతం, పేరుకూడా డిఫరెంట్ గా అనిపించతం తో తెలుగులో కూడా అదే పేరు ఉంచేసారు... అదన్న మాట "కబాలీ" పేరు వెనుక ఉన్న సంగతి.