»   » 70వ ఏట నాలుగో పెళ్లి

70వ ఏట నాలుగో పెళ్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి తన 70వ యేట పెళ్లి చేసుకున్నారు. 70 వ పుట్టినరోజుకి ఒక రోజు ముందు స్నేహితురాలు 42 ఏళ్ల పర్వీన్‌ దుసాంజ్‌ను వివాహం చేసుకున్నారు. దాదాపు పదేళ్లుగా ఆయన పర్వీన్‌తో సహజీవనం చేస్తున్నారు. శనివారం కబీర్‌ బేడి పుట్టినరోజు సందర్భంగా ఆయన బంధువులు, స్నేహతులు, శ్రేయోభిలాషులను వేడుకకు ఆహ్వానించారు.

Kabir Bedi marries close friend Parveen Dusanj on 70th birthday

అంతకు ఒక రోజు ముందు శుక్రవారమే కబీర్‌ బేడి పర్వీన్‌ను వివాహమాడారు. ఈ వివాహ వేడుకలకు ఇద్దరి తరఫున బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. కబీర్‌ బేడీకి ఇది నాలుగో పెళ్లి. గతంలో ఆయన ప్రతిమాబేడీ, సుసాన్‌ హంఫ్రీస్‌, నిక్కీబేడీలను వివాహమాడారు. ఆ వివాహాలన్నీ విడాకులతో ముగిశాయి.

ఈ సందర్బంగా వివాహానికి హాజరైన గుల్షన్ గ్రోవర్ మాట్లాడుతూ... మరో పది కి పైగా వివాహాలు చేసుకోవాలని అన్నారు. అలాగే ఆయన కుమార్తె పూజా బేడీ ఫేస్ బుక్ లో ఈ వివాహం గురించి ఇలా రాసుకొచ్చారు.

English summary
Veteran actor Kabir Bedi, who celebrated his 70th birthday on January 16, with his close friends also tied the knot with his long-time partner Parveen Dusanj, 42, on January 15. -
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu