»   » చిరంజీవిపై సత్యనారాయణ ఫైర్.. బాలయ్య మంచోడు..

చిరంజీవిపై సత్యనారాయణ ఫైర్.. బాలయ్య మంచోడు..

Written By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవిని సీనియర్ నటుడు, నవరస నటనాసార్వభౌమ సత్యనారాయణ తప్పుపట్టారు. చిరంజీవి 150 చిత్రాన్ని తాను చూడలేదని, ఆయన తనను ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. అయితే తన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చూడటానకి నందమూరి బాలకృష్ణ తనను ఆహ్వానించారని చెప్పారు.

సీనియర్ నటులకు గౌరవం లేదు

సీనియర్ నటులకు గౌరవం లేదు

కైకాల సత్యనారాయణ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ నటులకు తగిన గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చిరంజీవి, బాలయ్య సినిమాలపై

చిరంజీవి, బాలయ్య సినిమాలపై

తాజాగా చిరంజీవి 150వ చిత్రం, నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల గురించి సత్యనారాయణ మాట్లాడారు.

చిరంజీవి పిలువలేదు

చిరంజీవి పిలువలేదు

చిరంజీవి 150వ సినిమాను నేను చూడలేదు. చిరంజీవి నన్ను పిలవలేదు. అందుకే వెళ్లలేదు. థియేటర్‌కు వెళ్లి చూద్దామంటే..ఆ అరుపులు, గోలల్లో చూడలేను. అందుకే చిరంజీవి సినిమాకు వెళ్లలేదు.

బాలయ్య స్వయంగా పిలిచాడు

బాలయ్య స్వయంగా పిలిచాడు

బాలకృష్ణ ఫర్వాలేదు. ‘శాతకర్ణి' సినిమాను చూడడానికి రమ్మనమని బాలయ్య స్వయంగా ఫోన్‌ చేసి పిలిచాడు. అందుకే ఆ సినిమా చూడడానికి వెళ్లాను. చెన్నైలో సినిమా పెద్దలకు ప్రత్యేకంగా ఓ షో వేసేవారు. టాలీవుడ్‌లో ఆ ఆనవాయితీ లేదని సత్యనారాయణ చెప్పారు.

English summary
Senior Actor Satyanarayana angry over Chiranjeevi. He said chiranjeevi was not invited to see Khaidi Number 150 movie. But Balakrishna invited to watch his 100th movie Gautamiputra Shatakarni
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu