'ఎవడు' లో నా పాత్ర చనిపోతుంది
హైదరాబాద్ : 'ఎవడు' త్వరలో విడుదలవుతుంది. అల్లు అర్జున్‌కి జంటగా నటిస్తున్నాను. ఇందులో నాది చిన్న పాత్రే అయినా బాగుంటుంది. కథలో నా పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత సినిమాలో వచ్చే మార్పులు కీలకమని కాజల్ చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఎవడు చిత్రంలో ఆమె అల్లు అర్జున్ సరసన చేస్తోంది. గెస్ట్ రోల్ కోసం ఈ చిత్రంలో ఆమెను తీసుకున్నారు. ఆమె పాత్ర నచ్చి, చిన్నదైనా చేసానని చెప్తోంది.
రామ్‌చరణ్, శ్రుతిహాసన్, అమీజాక్సన్ కాంబినేషన్‌లో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాజు నిర్మించిన చిత్రం 'ఎవడు'. ఈ నెల 31న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 21కి వాయిదా వేశారు. గత కొద్ది రోజులుగా... ఎవడు చిత్రం చివరి నిముషంలో వాయిదా పడిన దగ్గర నుంచీ.. మీడియాలో రకరకాల ఊహాగానాలతో వార్తలు ప్రసారం అవుతున్నాయి. పవన్‌కళ్యాణ్, చరణ్ కలిసి మాట్లాడుకునే.... అత్తారింటికి దారేది | ఎవడు కొందరు తెలంగాణా ఇష్యూ గురించి అనీ,మరికొందరు పవన్ కి భయపడి..సినిమా ఆపుచేసారని, ఈ నేపధ్యంలో దిల్ రాజు ప్రకటన చేసారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ -''చరణ్‌కి కల్యాణ్‌గారిపై ఉన్న గౌరవం, కల్యాణ్‌గారికి చరణ్‌పై ఉన్న ప్రేమ ఈ సినిమా విడుదల తేదీ మారేట్లు చేసింది'' అన్నారు. అలాగే..-''రెండేళ్లు ఈ సినిమా కోసం శ్రమించాం. నిన్ననే ఈ సినిమా చూశాను. కథ విన్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో, చూసినప్పుడు అంతే ఉద్వేగానికి లోనయ్యాను. ఇదే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం. 'ఖలేజా' టైమ్‌లో కూడా 'బృందావనం'ని ఓ వారం వాయిదా వేసి, హిట్ కొట్టాం. మళ్లీ ఆ ఫీట్ రిపీట్ అవుతుంది'' అని చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ...''కల్యాణ్ బాబాయ్. చరణ్ అబ్బాయ్. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడు కానీ భయపడడు. ఏ సినిమా అయినా తెరపై చూస్తేనే సత్తా ఏంటో తెలిసేది. నాకు తెలిసి అత్తారింటికి దారేది, ఎవడు... రెండూ పెద్ద హిట్టయ్యే సినిమాలే'' అని 'దిల్' రాజు అన్నారు.


Click it and Unblock the Notifications











