»   » సుకుమార్ ని సెట్ చేయటానికే కాజల్ ఆ మాటలు!?

సుకుమార్ ని సెట్ చేయటానికే కాజల్ ఆ మాటలు!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుకుమార్,కాజల్ కాంబినేషన్ లో గతంలో 'ఆర్య 2' చిత్రం వచ్చి ప్లాపైంది. అయితే ఆ తర్వాత సుకుమార్ కోలుకుని హండ్రెడ్ పర్శంట్ లవ్ సినిమాతో హిట్ కొట్టి మహేష్ సినిమా పట్టాడు. దాంతో ఇప్పుడు సుకుమార్ కి ఫేవర్ కావాల్సిన అవసరం కాజల్ కి ఏర్పడింది. దాంతో ఎప్పుడో ప్లాప్ అయిన 'ఆర్య 2' చిత్రం ప్రస్దావిస్తూ మట్లాడుతోంది. ఆమె మాటల్లోనే...హిట్టు,ప్లాప్ లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదు. మన శ్రమ హిట్‌... ఫ్లాప్‌ అనే చిన్న పదాలతో తూచడం నాకు నచ్చదు. అలాగే నా సినిమాల గురించి చెబుతున్నప్పుడు ఎవరైనా 'మగధీర' ప్రస్తావిస్తారు.

అయితే ఆ సినిమాకి ఎంత విలువ ఇస్తానో, 'ఆర్య 2'కీ నేను అంతే విలువ ఇస్తాను. ఎందుకంటే 'మగధీర'లో అందంగా కనిపించడానికి ఎంత కష్టపడ్డానో, 'ఆర్య 2'లో ఇద్దరి మధ్య నలిగే అమ్మాయి పాత్రలో నటించడానికి అంతే కష్టపడ్డాను. ఒకదానికి మంచి ఫలితం వచ్చింది. రెండో దానికి రాలేదు. అయితే నేను పడిన కష్టం రెండు సినిమాల్లోనూ ఒక్కటే అని తేల్చి చెప్పింది. అయినా 'ఆర్య 2' లోని గీత పాత్ర నా మనసుకి బాగా దగ్గరైంది అంది.సుకుమార్ వింటున్నారా కాజల్ కబుర్లు.

English summary
Mahesh will also simultaneously shoot for a new project, which will take shape in the hands of Creative director Sukumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu