Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లి పనుల్లో బిజీ అయిన హీరోయిన్ కాజల్
హైదరాబాద్: హీరోయిన్ కాజల్ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ వివాహం ఈ నెల 28న ముంబైలో జరుగనున్న నేపథ్యంలో షూటింగులు అన్నీ ముగించుకుని ముంబైలో వాలిపోయింది. ముంబైకి చెందిన వ్యాపార వేత్త కరణ్ వాలేచాతో నిషాకి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.
'నా చెల్లి పెళ్లి ఈ నెల 28న జరుగబోతోంది. నాతో పాటు మా ఫ్యామిలీ మొత్తానికి ఆ రోజు ఒక ఎమోషనల్ డే. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను' అని కాజల్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది. తమిళ మూవీ 'జిల్లా'లో నటిస్తున్న కాజల్ చెల్లి పెళ్లి దృష్టిలో పెట్టుకుని షూటింగును కాస్త అడ్వాన్సుగానే పూర్తి చేసుకుందట.
ఇక నిషా అగర్వాల్ ... 'ఏమైంది ఈవేళ', 'సోలో' చిత్రాలతో విజయాలు అందుకొంది. మరోవైపు తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. త్వరలో విడుదల కాబోతున్న 'డి.కె.బోస్' అనే తెలుగు సినిమాలో నటించింది. నిషా జోరు చూసి 'కాజల్‌కి పోటీ వచ్చేసింది...' అనుకొన్నారంతా. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆమె పోటి నుంచి తప్పుకుంటోంది.
నిషా అగర్వాల్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం లేదు...ఆమె ప్రేమ వివాహం చేసుకుంటోంది. నిషా అగర్వాల్ తనకు తానుగానే తన జీవిత భాగస్వామి ఎంచుకుందని కాజల్ వెల్లడించింది. సాధారణంగా ఏ ఇంట్లో అయినా అక్క పెళ్లి తర్వాతే చెల్లి పెళ్లి జరుగుతుంది. కానీ కాజల్‌కు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేక పోవడంతో.....అక్క పెళ్లయ్యే వరకు ఆగడం నా వల్ల కాదంటూ పెళ్లికి రెడీ అయింది నిషా.