Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఆచార్య’ సెట్‌లో కొత్త జంట.. చిరు ఆశీర్వాదం తీసుకున్న కాజల్-గౌతమ్
కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. అక్టోబర్ 30న జరిగిన పెళ్లి, ఆ తరువాత మాల్దీవుల్లో హనీమూన్ ఇలా ప్రతీ విషయం సోషల్ మీడియా హాట్ టాపిక్ అయింది. పదేళ్ల స్నేహం, ప్రేమ బంధం గురించి కాజల్ ఎన్నో విషయాలను బయటకు చెప్పడం, అవి ఎంతగానో వైరల్ అవ్వడం జరిగింది. ఇక ఇన్నాళ్లకు కాజల్ మళ్లీ తన పనులను మొదలుపెట్టేసింది.

ఆచార్యలో కాజల్..
ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ ఎప్పుడు అడుగు పెడుతుందా? అని అందరూ ఎదురుచూడసాగారు. అసలు ఆచార్య హీరోయిన్ విషయంలో ఎంత పెద్ద దుమారం రేగిందో అందరికీ తెలిసిందే. త్రిష అకస్మాత్తుగా తప్పుకోవడంతో రచ్చ రచ్చ అయింది. ఆ తరువాత చివరకు కాజల్ చెంతకు ఆ అవకాశం చేరింది.

బ్యాక్ టు బ్యాక్..
అలా ఖైదీ నెంబర్ 150లో కాజల్ హీరోయిన్‌గా చిరంజీవి పక్కన అదరగొట్టేసింది. మళ్లీ ఇలా ఆచార్యలో చిరు పక్కన ఫిక్స్ అయింది. అయితే ఈ ఇద్దరి కాంబోలో సీన్స్, సాంగ్స్ షూట్ చేసేందుకు మాత్రం సమయం కలిసి రావడం లేదు. కరోనా, లాక్డౌన్ వల్ల అన్ని షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యాయి.

పెళ్లి వల్ల కాస్త లేట్..
అయితే కాజల్ తన పెళ్లి, హనీమూన్ వల్ల ఆచార్యకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే తాజాగా కాజల్ ఆచార్య సెట్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఒంటరిగా అడుగుపెట్టకుండా భర్తను తోడు తెచ్చుకుంది. మొదటి సారిగా ఇలా తన భర్తతో ఓ సినిమా సెట్‌కు కాజల్ విచ్చేసింది.

ఘన స్వాగతం..
కాజల్ గౌతమ్ కొత్త దంపతులు కావడం.. తమ సెట్‌లోకి ముందుగా రావడంతో ఆచార్య టీం ఘన స్వాగతం ఏర్పాటు చేసింది. చిరంజీవి పుష్పగుచ్చం అందించి నవదంపతులను ఆశీర్వదించాడు. ఆ తరువాత కేక్ కట్ చేసి వెడ్డింగ్‌ను సెలెబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చకచకా..
ఇక ఆచార్య షూటింగ్‌ను చకచకా పూర్తి చేసే పనిలో పడ్డాడు కొరటాల శివ. రామ్ చరణ్ పాత్ర, ఆ క్యారెక్టర్ కోసం మరో హీరోయిన్‌కు కొరటాల ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ పక్కన రష్మిక నటిస్తుంది వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏది ఏమైనా ఇక ఆచార్య షూటింగ్‌ను మాత్రం త్వరగా పూర్తి చేయాలని కొరటాల ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.