»   » బ్రహ్మోత్సవం: ఊటీ షూటింగులో కాజల్ (ఫోటో)

బ్రహ్మోత్సవం: ఊటీ షూటింగులో కాజల్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. బంధాలు..అనుబంధాలు నేప‌థ్యంతో విజ‌య‌వాడ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ బ్ర‌హ్మోత్స‌వం సినిమా తిరుప‌తిలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వం స‌న్నివేశంతో శుభం కార్డ్ ప‌డుతుంద‌ని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.

సినిమాకు సంబంధించిన కాజల్ ఫోటో ఒకటి బయటకు లీకైంది. ఊటీలో షూటింగ్ జరుగుతుండగా తీసిన ఫోటో అని తెలుస్తోంది.


Kajal Aggarwal on the sets of Brahmotsavam at Ooty

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016న విడుదల చేయటానికి తేదీని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రియల్ 29 కి వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్ ఎగ్రిమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.


ఈ సినిమాకు సంబంధించి రెండు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మహేష్ బాబు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడం ఒక విశేషం అయితే, మహేష్ ఈ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇవ్వనుండడం మరో విశేషం. ఇప్పటివరకూ కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే తమిళంలో పరిచయమైన మహేష్, బ్రహ్మోత్సవంతో తమిళంలో నేరుగా ఎంట్రీ ఇవ్వనుండడం అభిమానులకు ఆనందకరంగా మారింది.

English summary
Check out photo of Kajal Aggarwal on the sets of Brahmotsavam at Ooty.
Please Wait while comments are loading...