»   » డ్రగ్స్ కేసు: మేనేజర్ అరెస్టుపై హీరోయిన్ కాజల్ స్పందన

డ్రగ్స్ కేసు: మేనేజర్ అరెస్టుపై హీరోయిన్ కాజల్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ వైపు టాలీవుడ్లో డ్రగ్స్ కేసు ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తున్నవేళ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ వద్ద డ్రగ్స్(గంజాయి) దొరకడం అందరినీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. అతడు కాజల్ అగర్వాల్ మేనేజర్ కావడంతో ఆమెకు కూడా ఇందులో సంబంధం ఉందేమోననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఈ నేపథ్యంలో కాజల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రోనీ అరెస్టు విష‌యం తెలిసి తాను షాక్ అయిన‌ట్లు, రోనీ వృత్తిప‌రంగా మాత్రమే తనకు తెలుసు అని, అతడి వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలియదని కాజల్ స్పష్టం చేసింది.

కాజల్ ట్వీట్

కాజల్ ట్వీట్

రోనీ అరెస్టు విష‌యం తెలిసి మొద‌ట నేను షాక‌య్యాను. స‌మాజానికి హాని క‌లిగించే ఇలాంటి వారికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వను అని స్పష్టం చేశారు.

Puri Wife Lavanya Fires Over Charmi Puri Relation
వ్యక్తిగత జీవితం గురించి తెలియదు

వ్యక్తిగత జీవితం గురించి తెలియదు

నా వృత్తిప‌ర ప‌నుల్లో స‌హాయం చేసే వారిని నేను బాగా చూసుకుంటున్నంత మాత్రాన వారి వ్య‌క్తిగ‌త జీవితం గురించి తనకు తెలుసు అనుకోవడం పొరపాటు అని కాజల్ అన్నారు.

తల్లిదండ్రులే

తల్లిదండ్రులే

నా కెరీర్ విషయాలను ఎల్లప్పుడూ నా తల్లిదండ్రులే మేనేజ్ చేస్తుంటారు. ఇండ‌స్ట్రీలో నాకు స‌హాయం చేసే వారంద‌రితోనూ నేను కేవ‌లం వృత్తిప‌రమైన స్నేహ‌ం మాత్రమే కొన‌సాగిస్తాను అని కాజల్ తెలిపారు.

వృత్తిపర అవసరాలకు మాత్రమే

వృత్తిపర అవసరాలకు మాత్రమే

ఎవరితో అయినా సరే ఒక్క‌సారి వృత్తిప‌ర అవ‌స‌రాలు తీరిపోయాక వారి గురించి ఆలోచించడంగానీ, పట్టించుకోవడంగానీ నేను చేయను` అని కాజ‌ల్ తన ట్విట్టర్ పోస్టు ద్వారా తెలిపింది.

English summary
Kajal Aggarwal reacted on her manager's arrest. "I am absolutely shocked and appalled about this whole incident with Ronnie. I'm in zero support of this and any behavior that is detrimental to hygiene of our society." Kajal tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu