For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తమన్నాకు చేదు అనుభవం.. కాజల్‌కు రాణియోగం.. రేవతి, సుహాసిని సంబంధమిదే..

  By Rajababu
  |

  ఏ ముహుర్తాన మొదలుపెట్టారో ఏమో గానీ తమిళ వెర్షన్ క్వీన్ చిత్ర షూటింగ్ అడుగు ముందుకు పడటం లేదు. కారణం ఏదోగానీ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను సినిమా నుంచి సాగనంపారు. హిందీ క్వీన్‌లో కంగన రనౌత్ పోషించిన పాత్ర ప్రస్తుతం అందాల తార కాజల్ అగర్వాల్‌కు దక్కినట్టు సమాచారం. వికాస్ బెహల్ దర్శకత్వం వహించిన క్వీన్ చిత్రం బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ప్రయత్నాలకు ముందుకు సాగపోవడం గమనార్హం. తెలుగులో సమంత కథానాయికగా క్వీన్‌ను తెరకెక్కించాలని చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే.

  తమన్నా అవుట్

  తమన్నా అవుట్

  క్వీన్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. తమన్నా భాటియాను కథానాయికగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల తమన్నాను సినిమా నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆ చిత్రం ఎలాంటి సందడి లేకుండా మూలన పడింది. నిర్మాత, సీనియర్ నటుడు త్యాగరాజన్ కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక క్వీన్ సినిమా కథ ముగిసినట్టే అనుకొంటున్న సమయంలో తాజాగా కాజల్ అగర్వాల్‌తో సినిమాను ప్రారంభించనున్నారనే వార్త తమిళ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

  క్వీన్ సినిమాలో చేయాలని..

  క్వీన్ సినిమాలో చేయాలని..

  తమిళ క్వీన్‌లో కంగన పోషించిన పాత్ర దక్కడంపై తమన్నా సంతోషాన్ని వ్యక్తం చేసింది. క్వీన్ సినిమా చూసినప్పటి నుంచి ఆ పాత్ర చేయాలనే కోరిక కలిగింది. ప్రస్తుతం ఆ కోరిక తీరింది. మహిళా నేపథ్యం ఉన్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని క్వీన్ రుజువు చేసింది అని గతంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

  నేనేమీ స్పందించను..

  నేనేమీ స్పందించను..

  క్వీన్ నుంచి తప్పించిన తర్వాత మీడియా స్పందన కోరగా తమన్నా మాట్లాడటానికి నిరాకరించారు. క్వీన్ తమిళ రీమేక్‌తో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. అయితే తనను తప్పించడం వెనుక కారణాలను వెల్లడించడానికి ఆసక్తిని చూపలేదు. ఆ తర్వాత ఊపిరి, బాహుబలి చిత్రాలతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి కేంద్రీకరించింది.

  క్వీన్‌గా కాజల్..

  క్వీన్‌గా కాజల్..

  తమిళ చిత్ర పరిశ్రమలో చాలా నెలల తర్వాత మళ్లీ క్వీన్ అంశం తెరపైకి వచ్చింది. కాజల్ అగర్వాల్‌ను తమిళ రీమేక్‌లో తీసుకొన్నట్టు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నది. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలను చేజిక్కించుకొంటున్న కాజల్ అయితే సినిమాకు మంచి హైప్ వస్తుందని, కమర్షియల్‌గా కూడా సానుకూలత ఉండే అవకాశం ఉంటుందని నిర్మాత అభిప్రాయపడినట్టు సమాచారం.

  జోరు మీద ఉన్న కాజల్

  జోరు మీద ఉన్న కాజల్

  తెలుగులో జనతా గ్యారేజ్‌లో స్పెషల్ సాంగ్‌లో నర్తించి ప్రేక్షకులను కాజల్ మెప్పించింది. ఆ తర్వాత చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. ప్రస్తుతం కాజల్ తమిళంలో అజిత్ చిత్రం వివేకంలోనూ, విజయ్ కెరీర్‌లో 61వ సినిమాలోను నటించే అవకాశం చేజిక్కించుకొన్నది.

  రేవతి డైరెక్షన్.. సుహాసిని డైలాగ్స్

  రేవతి డైరెక్షన్.. సుహాసిని డైలాగ్స్

  ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సీనియర్ నటి రేవతి దర్శకత్వం వహిస్తున్నారు. మరో సీనియర్ నటి, మణిరత్నం సతీమణి సుహాసిని సంభాషణలు రాస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఏర్పడింది. తమిళంలో మహిళా కథా చిత్రాలకు మంచి ఆదరణ ఉండటంతో ఈ చిత్ర రీమేక్‌ విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని నిర్మాత వ్యక్తం చేస్తున్నారు.

  కన్నడంలో షూటింగ్ ప్రారంభం..

  కన్నడంలో షూటింగ్ ప్రారంభం..

  కన్నడ చిత్ర పరిశ్రమలోను క్వీన్ రీమేక్‌కు రంగం సిద్ధమైంది. ఈ చిత్ర షూటింగ్ మంగళవారం కన్నడంలో ప్రారంభమైంది. ఈ సినిమాకు బటర్‌ఫ్లై అని పేరుపెట్టారు. పారుల్ యాదవ్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

  English summary
  The Tamil remake of Queen is struggling to take off -- after Tamannaah walked out of the film, rumour is that Kajal Aggarwal might essay the role that Kangana Ranaut played in the original. Originally planned with Tamannaah Bhatia in the titular role of Rani, played by Kangana Ranaut. Revathy will still direct the project while actor-filmmaker Suhasini Mani Ratnam will pen the dialogues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X