ఎన్టీఆర్ ని కాదనలేకే కాజల్ పాడింది
బెంగుళూరు: రీసెంట్ గా ఎన్టీఆర్ ఓ కన్నడ చిత్రంలో పాట పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రంలో కాజల్ కూడా ఓ పాట పాడింది. ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఇలా వరస పెట్టి అందరి చేతా పాడించేస్తున్నాడు. ఆ నిర్మాత ఎన్టీఆర్ కు ఫ్రెండ్ కావటంతో..కాజల్ ని ఎన్టీఆర్ ఒప్పించి పాడించినట్లు సమాచారం.

కన్నడ స్టార్ హీరో పునీత్‌రాజ్‌కుమార్ హీరో గా నటిస్తున్న చక్రవ్యూహ చిత్రంలో ఆమెకు పునీత్‌తో కలిసి డ్యూయిట్ పాడే అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని కాజల్ ధ్రువీకరించారు. చిత్ర నిర్మాత లోహిత్ ఈ విషయమై ట్వీట్ చేసారు.
కాజల్ మాట్లాడుతూ.... కొత్త సంవత్సరంలో ఏదైనా కొత్తగా చేద్దామనుకున్నానన్నారు. తనకు పాటలు పాడటమంటే ఇష్టమని.. అలా అని తనదేమీ కోకిల గొంతు కాదని.. కాకపోతే పాటలు హమ్ చేస్తూ ఉంటానని కాజల్ చెప్పారు. తనకు ఈ అవకాశం సంగీత దర్శకుడు తమన్, పునీత్‌ల వల్లే వచ్చిందన్నారు. ఈ పాటకు అభిమానుల నుంచి వచ్చే స్పందనను బట్టి ముందు ముందు పాటలు పాడేదీ లేనిదీ నిర్ణయించుకుంటానని కాజల్ చెప్పారు.


Click it and Unblock the Notifications











