»   » తమన్నాతో నాకు మంచి రిలేషన్ షిప్ ఉంది...!

తమన్నాతో నాకు మంచి రిలేషన్ షిప్ ఉంది...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెద్ద కళ్ళ కాజల్ కి ఇప్పుడు మీడియా మీద పీకల దాకా కోపం వుంది. జర్నలిస్టుల్ని చూస్తే చాలు మండిపడిపోతోంది. కారణం ఏమిటనుకుంటున్నారా...ఆమె గురించి ఈమధ్య లేనిపోని వార్తలు రాస్తున్నారట. రివ్వున దూసుకుపోతున్న తమన్నా సక్సెస్ ను చూసి తాను అసూయపడుతోందంటూ వస్తున్న వార్తలు తనని చాలా అప్ సెట్ చేశాయంటోంది. అసలు ఒకర్ని చూసి కుళ్ళుకోవడం, ఇతరులతో గొడవలు పడడం తన మనస్తత్వానికి ఏమాత్రం పడవని స్పష్టం చేసింది.

'నిజమే... మా మధ్య పోటీ వాతావరణం వుంది. కొత్తగా కథానాయికలు వస్తున్నప్పుడు ఎప్పుడూ పోటీ వుంటుంది. అయితే, అది ఆహ్లాదకరంగానే వుంటుంది తప్పితే, అసూయ చెందే రీతిలో మాత్రం వుండదు. మీకో విషయం తెలుసా...అనుష్క నాకు మంచి ఫ్రెండ్. అలాగే, త్రిష, ఇలియానా అంటే నాకెంతో ఇష్టం. ఇక తమన్నాతో కూడా నాకు మంచి రేలేషనే వుంది' అంటూ చెప్పుకోస్తోంది కాజల్. నిజమేనా... నమ్మచ్చా?

English summary
Apparently Tamanna scored good marks with ‘100% Love’ dominating Chaitu but she desperately needs a solid hit on the scale of ‘Magadheera’ to make a strong ground in Tollywood in order to pose a threat to Kajal’s number one position.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu