»   » కాజల్ హాఫ్ సెంచరీ.. నాటౌట్.. డబుల్ ధమాకా..

కాజల్ హాఫ్ సెంచరీ.. నాటౌట్.. డబుల్ ధమాకా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రికెట్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత ఈ సెంచరీల గొడవ ఏమిటని చిరాకు పడుతున్నారా? కాజల్‌కు క్రికెట్‌కు సంబంధమేమిటని ఆలోచిస్తున్నారా? అలాంటిదేమీ లేదండి.. జూన్ 19న పుట్టిన రోజు జరుపుకొంటున్న కాజల్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి పదేళ్లు దాటింది. ఈ పదేళ్ల కాలంలో కాజల్ 50 చిత్రాల్లో నటించింది. రానా సరసన నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రం కాజల్‌కు 50వ సినిమా. ఈ సందర్భంగా కాజల్ తన సినీ ప్రయాణాన్ని ఓ సారి గుర్తు చేసుకొన్నది.

పదేళ్ల క్రితం తేజతో సినీ కెరీర్ ప్రారంభం

పదేళ్ల క్రితం తేజతో సినీ కెరీర్ ప్రారంభం

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కాజల్‌ను పరిచయం చేసింది దర్శకుడు తేజ. లక్ష్మీ కల్యాణం చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన నటించింది. తొలి చిత్రంతోనే నటనపరంగా ఆకట్టుకొన్నది. తెలుగు అమ్మాయిలా ప్రేక్షకుల గుండెలో ముద్ర వేసుకొన్నది. అప్పటి నుంచి కాజల్ సినీ ప్రయాణంలో ఎదురేలేకుండా పోయింది. మళ్లీ పదేళ్ల తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం కాజల్ జతకట్టింది.


50 సినిమాలు పూర్త చేసిన కాజల్

50 సినిమాలు పూర్త చేసిన కాజల్

పదేళ్ల ప్రయాణం ఎంతో అందంగా, ఆనందంగా సాగింది. యాభై సినిమాల మైలురాయిని చేరుకోవడం ఓ గొప్ప అనుభూతి. ఈ పుట్టినరోజుకి ఇంతకంటే గొప్ప బహుమతి ఉండదేమో అని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తాజాగా చిరంజీవితో నటించి ఖైదీ నంబర్ 150 చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.


విభిన్నమైన పాత్రలో

విభిన్నమైన పాత్రలో

గతంలో ఎన్నడూ చేయనటువంటి ఓ విభిన్నమైన పాత్రని నేనే రాజు నేనే మంత్రిలో చేశా. ఇందులో నా పాత్ర పేరు రాధ. రానాతో సెట్‌లో సరదాగా పనిచేశా. ప్రతి సన్నివేశం గురించి మేమిద్దరం మాట్లాడుకొని నటించేవాళ్లం. నేనే రాజు నేనే మంత్రి లాంటి విభిన్నమైన చిత్రంలో నటించడం ఎప్పుడూ సంతోషమే అని కాజల్ వెల్లడించింది.


ఆ నమ్మకం ఉంది..

ఆ నమ్మకం ఉంది..

నాకోసం మరిన్ని కొత్త పాత్రలు పుడుతూనే ఉంటాయనే నమ్మకం ఇప్పటికీ ఉంటుంది. ఆ నమ్మకమే నటిగా నన్ను ముందడుగు వేసేలా చేస్తున్నది. ఉత్సాహంతో ముందుకెళ్లేలా చేస్తున్నది'' అని కాజల్‌ చెప్పింది . ఆమె ప్రస్తుతం తన తొలి చిత్ర కథానాయకుడు కల్యాణ్‌రామ్‌తో ఎమ్మెల్యే అనే చిత్రంలో నటిస్తున్నది.English summary
Actress Kajal finishes her 10 years Film journey. She completed in 50 films in span 10 years. her movie Nene Raju nene Mantri with Rana is ready to release. June 19th is her birthday. In this occassion she recollected her sweet memories in film Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X