»   » ఎన్టీఆర్‌తో జాగ్రత్తగా చేయాల్సివచ్చింది...కాజల్

ఎన్టీఆర్‌తో జాగ్రత్తగా చేయాల్సివచ్చింది...కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బృందావనం'లో సరదాగా సాగిపోయే పాత్ర చేసాను. ఎన్టీఆర్ ‌తో ఇది నా తొలిసినిమా. ఆయన ఎంత గొప్ప నటుడో, అంత మంచి డాన్సర్‌ కూడా. ఆయనతో చేసే సన్నివేశాలను జాగ్రత్తగా చేయాల్సివచ్చింది. ఈ సినిమా కూడా నాకు మంచి పేరును తెచ్చిపెడుతుంది' అంటూ చెప్పుకొచ్చింది కాజల్‌. అలాగే ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు సాధించిన మగధీర చిత్రం గురించి చెపుతూ...'మగధీర' చిత్రంలోని మిత్రవింద పాత్రకు మాత్రం కాస్త కష్టపడాల్సివచ్చింది. ఎందుకంటే..ఆహార్యం దగ్గర నుంచి హావభావాల వరకూ ప్రతి విషయంలో వైవిధ్యత చూపిస్తేనే అలాంటి పాత్రలకు న్యాయం చేయగలుగుతాం. దర్శకుడు రాజమౌళి మంచి నటుడు కూడా అవ్వడంతో ప్రతి సన్నివేశం ఆయన నటించి మాతో చేయించేవారు. కాస్త కష్టమైనా ఆ పాత్ర అంతబాగా రావడానికి కారణం అదే. ఏదిఏమైనా కొత్త తరహా పాత్రలు చేసినప్పుడే కళాకారులకు సంతృప్తి అంటోందామె.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu