»   » కళాభవన్ మణి సూసైడ్ చేసుకోలేదు సరే...మరి విషం సంగతేంటి?

కళాభవన్ మణి సూసైడ్ చేసుకోలేదు సరే...మరి విషం సంగతేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కొచ్చి : ఈ రోజు మరణించిన కళాభవన్ మణి వార్త ..సినీ ప్రపంచంలో సంచనలంగా మారింది. ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారా అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపద్యంలో ఆయన మిత్రుడు మళయాళ స్టార్ హీరో దిలీప్ మీడియాతో మాట్లాడారు.

  కళాభవన్ కు ఉన్న అతి తక్కువ మంది స్నేహితుల్లో తను ఒకరినని , ఆయనకు గురించి తనకు బాగా తెలుసు అని , సూసైడ్ చేసుకునేటంత బలహీన మనస్కుడు కాదని అవన్నీ కేవలం బేస్ లెస్ రూమర్స్ అని కొట్టిపారేసారు. అంతేకాదు ఆయన తనకున్న ఒకే ఒక కుమార్తే అంటే ప్రాణమని, అలాంటివాళ్లు అసలు సూసైడ్ చేసుకునే అవకాసం లేదని తేల్చి చెప్పారు.

  అయితే కళాభరన్ మణి మరణించటానికి ముందు ఆయన శరీరం విషం కలిగి ఉండటం గమనించారు. వస్తున్న వార్తలే నిజమైతే ఆల్కహాల్ ద్వారా ఆ విషం ఆయన శరీరంలోకి వెళ్లిందని అక్కడ మీడియా అంటోంది.

  కళాభవన్‌ మణి ఆదివారం కన్నుమూశారు. కాలేయ వ్యాధితో కొచ్చిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. వివిధ భాషల్లో ఆయన 100కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో జెమిని, ఎవడైతే నాకేంటి తదితర చిత్రాల్లో నటించారు.

  ప్రముఖ నటుడు కళాభవన్‌ మణి భార్య డా.నిమ్మి, కూతురు శ్రీలక్ష్మి ఉన్నారు. మలయాళ చిత్ర సీమ నుంచి నట ప్రయాణం మొదలుపెట్టిన మణి తెలుగు, తమిళంలోనూ నటించి పేరు తెచ్చుకొన్నారు. శనివారం తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు కొచ్చిలోని అమిత్ర ఆస్పత్రిలో చేర్చారు. ఐసీయూ అత్యవసర వైద్యసేవలు తీసుకుంటు ఆదివారం రాత్రి 7.15 గంటలకు కన్నమూసినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

  స్లైడ్ షోలో ...మణి కెరీర్ లో అరుదైన ఫొటోలు...

  దిలీప్ తో ...

  దిలీప్ తో ...

  దిలీప్ ..ఈ విషయమై ఆయన ఖండన మీడియా ముఖంగా చేసారు

  మంచి స్నేహితులు

  మంచి స్నేహితులు

  దిలీప్, కళాభవన్ మణి ఇద్దరూ కలిసే ఇండస్ట్రీలో మంచికైనా, చెడుకైనా వెళ్లేవారు

  ముమ్మట్టితో

  ముమ్మట్టితో

  సీనియర్ నటుడు ముమ్మట్టి అంటే మొదటి నుంచీ మణి కు ఇష్టమని చెప్పేవారు

  మంచి చనవు

  మంచి చనవు

  మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో ఆయన మంచి చనువుతో వ్యవహరించేవారు

  స్నేహితులతోనే

  స్నేహితులతోనే

  మణి ఒంటిరిగా ఎప్పుడూ కనపడేవారు కాదు..తన స్నేహితులతోనే కనిపించేవారు.

  కలిసిపోయేవారు

  కలిసిపోయేవారు

  మణి చిన్నా,పెద్దా ఆర్టిస్టులందరితో కలిసిపోయేవారు

  అవార్డు

  అవార్డు

  మణి..అవార్డు అందుకుంటున్న సమయంలో ఇలా..

  సెట్ లో

  సెట్ లో

  మణి సెట్ లో ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండేవారు అని చెప్తారు.

  ఫ్యామిలీతో

  ఫ్యామిలీతో

  మణి ఎక్కువగా తన కుటుంబానికి విలువ ఇచ్చేవారు

  వివాహం

  వివాహం

  మణి ..వివాహ సమయంలో ఫొటో ఇది

  తోటి ఆర్టిస్టులతో

  తోటి ఆర్టిస్టులతో

  అయ్యప్ప మాలలో ఉన్న మణి...తోటి ఆర్టిస్టులతో కలిసి

  ఆలోచనలు

  ఆలోచనలు

  దర్శకులతో మణి తన ఆలోచనలు పంచుకుని ,ఇంప్రవైజ్ చేసేవారు

  సినీ కుటుంబం

  సినీ కుటుంబం

  మణి తన తోటివారందిరితో ఓ కుటుంబంలా మెలిగేవారు

  స్పందన

  స్పందన

  ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించటానికి వెనకాడేవారు కాదు

  ఎలాంటి

  ఎలాంటి

  మణి తన వయస్సుని పట్టించుకోకుండా ఎలాంటి పాత్రనైనా పండించటానికి ముందుకొచ్చేవారు

  గుర్తుపట్టలేం

  గుర్తుపట్టలేం

  మణి ని నటనతోనే గుర్తు పట్టాలి తప్ప మేకప్ లో కష్టం అంటూంటారు

  English summary
  Dileep, the actor who is the best buddy of the late actor Kalabhavan Mani, rubbished the rumours regarding his sudden death. Dileep states that Kalabhavan Mani will not commit suicide. According to the actor, Mani was a complete family man, who has loved his only daughter, more than anything in this world. A doting father like him cannot commit suicide, no matter what.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more