అంజలి 'అదృశ్యం' వెనుక రాజకీయ కుట్ర
'తమిళర్ నలం పేరియక్కం' ...ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నాగర్‌కోవిల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కళంజియం మీడియాతో మాట్లాడారు. శ్రీలంక తమిళుల పక్షాన పోరాడుతున్న 'తమిళర్ నలం పేరియక్కం' సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పని చేస్తున్నానన్నారు. శ్రీలంక తమిళుల అంశంపై తాను డీఎంకే, కాంగ్రెస్‌లపై తాము విమర్శలు చేస్తున్నామన్నారు. ఈ దష్ట్యా అంజలి వ్యవహారంలో రాజకీయ కుట్ర ఉండొచ్చని అనుమానం కలుగుతోందన్నారు.
అలాగే ...అంజలి కుటుంబ సమస్యల కారణంగానే ఇంటి నుంచి వెళ్పోయిందన్నారు. తల్లిదండ్రులపై నటీమణులు ఫిర్యాదు చేయడం తమిళ చిత్రరంగంలో సాధారణ విషయమన్నారు. దర్శకుడైన తనపై ఫిర్యాదు చేయడం మాత్రం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. అంతేకాక అంజలి ఆస్తిని అపహరించేందుకు ప్రయత్నించానని, హత్యా బెదిరింపులు చేశానని, చిత్ర హింసలకు గురి చేశానంటూ తనపై చేసిన నిరాధారమైన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానట్టు కళంజియం వెల్లడించారు.
ఇక తనపై ఆరోపణలు చేసిన అంజలిపై సైదాపేట కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశానని 'ఊర్ సుట్రి పురాణం' చిత్రంలో అంజలి తనకు జోడీగా నటిస్తోందని, ఈనెల 24 నుంచి షూటింగ్‌కు కాల్షీట్ కూడా ఇచ్చిందని తెలిపారు. అంజలి షూటింగ్‌లో పాల్గొనని పక్షంలో తమిళనాడు చలనచిత్ర దర్శకుల సంఘం, చలన చిత్ర నిర్మాతల సంఘంలో ఆమెపై ఫిర్యాదు చేస్తానన్నారు.
క్లోజ్ అయ్యిందనుకున్న అంజలి మిస్సింగ్ వ్యవహారం వెనుక తాజాగా దర్శకుడు రాజకీయ కోణాన్ని జోడించడం మళ్లీ మీడియాలోకి సంచలనం కలిగించింది. అదృశ్యం వెనుక అసలు కారణాలను అంజలి వెల్లడిస్తే తప్ప ఈ వ్యవహారానికి కొంత ముగింపు దొరికదు .


Click it and Unblock the Notifications












