»   » ‘ఓం’ : దర్గాలో ప్రత్యక్షమైన కళ్యాణ్ రామ్

‘ఓం’ : దర్గాలో ప్రత్యక్షమైన కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన 3డి చిత్రం 'ఓం' ఈ నెల 19న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆయన ఈ రోజు ఉదయం కడప జిల్లాలోని ప్రఖ్యాత పెద్ద దర్గాను సందర్శించి మొక్కులు సమర్పించారు.

కడప జిల్లా పెద్ద దర్గాను సందర్శించడం సినిమా వాళ్లకి ఎప్పటి నుండో ఓ సెంటిమెంటుగా మారింది. గతంలో పలు మార్లు టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ దర్గాను సందర్శించారు. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ దర్గాకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వస్తారు.

'ఓం' సినిమా వివరాల్లోకి వెళితే...

కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బేనర్‌పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు. 3డిలో రూపొందుతున్న 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు.

దాదాపు 20 కోట్ల పైచిలుకు ఖర్చుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కళ్యాణ్ ఉన్న మార్కెట్ కంటే ఇది అధిక మొత్తం. అయినా సరే సక్సెస్ అవుతుందనే నమ్మకంతో సాహసోపేతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

English summary
Tollywood actor Kalyan Ram visited Kadapa Pedda Dargah today. Kalyanram’s next movie Om is set to the hit the screen on July 19th. Kriti Kharbanda and Nikesha Patel have played the lead roles in the film and Sunil Reddy has directed the film. Kalyan Ram has produced the film under NTR Arts banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu