Just In
- 3 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతీయుడు 2 సెట్‌లో ప్రమాదం.. కోటి విరాళం ప్రకటించిన కమల్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, భారతీయ చలన చిత్రం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలని భావించిన ఈ ద్వయం గతేడాది ఇండియన్ 2ను పట్టాలెక్కించింది. అయితే ఏ ముహూర్తాన వీరు ఆ చిత్రాన్ని మొదలు పెట్టారో గానీ ఆటంకాలు ఎదురువుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

చెన్నైలో షూటింగ్
ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతోంది. ఈ మేరకు లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో సెట్‌ను డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి కింద పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

ముగ్గురు వ్యక్తులు దుర్మరణం..
ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. దాదాపు పదిమంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ ఉన్నారని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందినట్లు ప్రెస్ నోట్ విడుదల చేసింది.

ఉలిక్కిపడ్డ టాలీవుడ్, కోలీవుడ్
ఈ ఘటనకు సంబంధించిన వార్త తెలియగానే.. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఉలిక్కిపడ్డాయి. కేవలం తమిళ నటులే కాదు.. తెలుగు సినీ ప్రముఖులు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, ధనుష్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

కోటి విరాళం ప్రకటించిన కమల్..
ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. ఈ ఘటనతో షాక్ తిన్న చిత్రయూనిట్ కొన్ని రోజుల పాటు షూటింగ్‌ను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.