twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ కాంత్ కొత్త ట్వీట్, అయితే ఈ సారి కమల్ గురించి

    By Srikanya
    |

    చెన్నై: నటుడు కమల్‌హాసన్‌ను ఫ్రాన్స్‌ అత్యున్నత పౌరపురస్కారం 'షెవలియర్‌' అవార్డు వరించిన సంగతి తెలిసిందే. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌.. కమల్‌ హాసన్‌కు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.


    'మా తరం నటీనటులకు షెవలియర్‌(వీరుడు) అయిన నా మిత్రుడు కమల్‌ హాసన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ తలైవా ట్వీట్‌ చేశారు.

    ఇక ఆ అవార్డు పూర్తిపేరు.. షెవలీర్ డి లార్డ్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్. 'నైట్ ఇన్ ద నేషనల్ ఆర్డర్ ఆర్ట్స్ అండ్ లెటర్స్' అని దానికి అర్థం. కమల్‌కు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. వెంటనే రజనీకాంత్ స్పందించారు. తమ తరంలో ఉన్న నడిగర తిలకం కమల్‌హాసన్‌కు షెవలీర్స్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తమిళంలో ట్వీట్ చేయటం ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారింది.

    ముఖ్యంగా సాధారణంగా నడిగర తిలకం అని విశ్వవిఖ్యాత తమిళనటుడు శివాజీ గణేశన్‌ను అంటారు. అయితే, ఈ తరంలో నడిగర తిలకం మాత్రం కమల్ హాసనే అంటూ రజనీ ట్వీట్ చేయడం విశేషం అని చెప్తున్నారు.

    సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే రజనీ.. ఇటీవల మాత్రమే ఒకటి రెండు అంశాలపై స్పందిస్తున్నారు. పీవీ సింధు రజత పతకం సాధించిన వెంటనే.. 'నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ కమల్‌ను అభినందించేందుకు తన సోషల్ మీడియాను వాడుకున్నారు.

    స్లైడ్ షోలో అవార్డ్ విషయమై కమల్ స్పందన చూడండి.

    అంకితం

    అంకితం


    ఈ అవార్డుని అభిమానులకు, తనను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు అంకితమిచ్చారు కమల్

    గౌరవం

    గౌరవం


    ఈ అవార్డ్ అందుకుంటున్నందుకు తనకు గర్వంగా లేదు కానీ చాలా గౌరవంగా ఉందని అన్నారు కమల్

    లేరు కానీ

    లేరు కానీ

    ఈ ఆనందం పంచుకోవటానికి తన తల్లి తండ్రులు లేరు కానీ తన పిల్లలు ఉన్నారని అన్నారు.

    అశోశియేషన్

    అశోశియేషన్

    తమిళనటీనటుల సంఘం, తమిళనాడు అసెంబ్లీ ఈ విషయమై కమల్ కి అభినందనలు తెలియచేసాయి

    సన్మానం

    సన్మానం


    కమల్ కు అవార్డ్ రావటం యావత్ తమిళ సినీ పరిశ్రమకే వచ్చినట్లు భావిస్తున్నారని, త్వరలోనే కమల్ కు సన్మానం చేస్తామని చెప్తున్నారు

    స్టాలిన్ ట్వీట్

    స్టాలిన్ ట్వీట్

    తమిళ పొలిటికల్ లీడర్ స్టాలిన్..కమల్ ని మల్టీ టాలెంటెడ్ పర్శన్ గా అభినందిస్తూ ట్వీట్ చేసారు

    అప్ కమింగ్

    అప్ కమింగ్


    కమల్ అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే...మొదట శభాష్ నాయుడు, ఆ తర్వాత విశ్వరూపం 2, పంచతంత్రం సీక్వెల్ ఉండబోతున్నాయి

    English summary
    Actor-filmmaker Kamal Haasan on Sunday said he would like to dedicate the Chevalier award de L'Ordre Arts et Letters, conferred by the French government, to his admirers and audience. He also said the honour humbles him."I dedicate this award to my admirers and audience who give me the tenacity of purpose to pursue to this day in moment my arts and letters," Haasan said in an audio message.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X