»   » కమల్ హాసన్‌కు ముచ్చటగా మూడో బ్రేకప్! 13 ఏళ్ల బంధానికి కట్ చెప్పిన గౌతమి

కమల్ హాసన్‌కు ముచ్చటగా మూడో బ్రేకప్! 13 ఏళ్ల బంధానికి కట్ చెప్పిన గౌతమి

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్. సినిమాల్లో మాదిరే నిజజీవితంలో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎవో కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. కమల్ , సారిక చాలా సినిమాల్లో కలిసి నటించారు.సినిమాలు చేసే టైంలోనే వీరి మధ్య ప్రేమ చోటుచేసుకోవడంతో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి ఇద్దరూ కుమార్తెలు కూడా జన్మించారు.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న శృతిహాసన్ ఒక కుమార్తె కాగా రెండో కుమార్తె పేరు అక్షరహాసన్. అయితే కమల్ సారికతో విడాకులు తీసుకుని గౌతమి తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే... అయితే ఇప్పుడు ఈ పదమూడేళ్ళ బందం కూడా తెగిపోయింది ఒక్క సారిగా కమల్ అభిమానులకీ, సన్నిహితులకీ షాక్ ఇస్తూ ఈ విషయాన్ని బయట పెట్టింది గౌతమి. మొదటి భార్య వాణీ గణపతి, రెండో భార్య సారిక తో కూడా ఎక్కువ రోజులు భందాన్ని నిలుపుకోలేక పోయిన కమల్... ఇప్పుడు గౌతమి తోకూడా తెగదెంపులు చేసుకున్నాడు....

బాధాకరమైన నిర్ణయం:

బాధాకరమైన నిర్ణయం:

13 ఏళ్ల పాటు సాగిన తమ సహ జీవనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు గౌతమి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈ 13 సంవత్సరాల్లో కమల్ హాసన్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని గౌతమి తెలిపారు. తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు రాకముందే కమల్‌ తన కలల హీరో అని గౌతమి కొనియాడారు. కమల్‌కు మరిన్ని విజయాలు రావాలని ఆమె ఆకాంక్షించారు.

2003 నుంచి కమల్‌తో సహజీవనం:

2003 నుంచి కమల్‌తో సహజీవనం:

గౌతమికి పలు విపత్కర సందర్భాల్లో కమల్ అండగా నిలిచారు. కమల్‌తో సహజీవనానికి ముందు గౌతమి వ్యాపారవేత్త సందీప్ భాటియాను 1998లో పెళ్లాడారు. వీరిద్దరికీ పుట్టిన కూతురే సుబ్బులక్ష్మి. పెళ్లైన మరుసటి ఏడాదే భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 2003 నుంచి కమల్‌తో సహజీవనం చేశారు. తెలుగులో విచిత్ర సోదరులు చిత్రం నుంచి కమల్, గౌతమిల స్నేహం చిగురించింది. తమ సహజీవనం గురించి గతంలో వీరు మాట్లాడుతూ వివాహ బంధంపై తమకు అంత విశ్వాసం లేకపోవడం వల్లే సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. 35 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌‌కు గురైన గౌతమి అతి కష్టం మీద ఆ వ్యాధిని జయించారు. ఆ సమయంలో ఆమెకు కమల్ తోడుగా నిలిచారు.

లివిన్ రిలేషన్ షిప్ :

లివిన్ రిలేషన్ షిప్ :

సారికతో విడిపోయిన అనంతరం కమల్ తర్వాతి పార్ట్నర్ గురించి చాలా రూమర్లే వచ్చాయి. 2004 లో సమయంలో కమల్‌తో వరసగా సినిమాల్లో నటించిన సిమ్రాన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడనేది ఆ పుకార్ల సారాంశం. అయితే ఎందుకో అది జరగలేదు. ఆ తర్వాత కమల్, గౌతమిలు లివిన్ రిలేషన్ షిప్ మొదలు పెట్టారు. మేజర్లు అయిన వీరి కూతుర్లు కూడా ఈ బంధానికి విలువనిచ్చారు! కమల్ తన మాజీ భార్యలకు ఇచ్చినటువంటి హోదానే గౌతమికి కూడా ఇచ్చాడు. ‘ఉత్తమవిలన్' సినిమాలో కమల్ కు గౌతమి కాస్టూమ్ డిజైనర్.

కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు:

కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు:

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన గౌతమి విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. గౌతమి మొట్టమొదటిసారిగా నటించిన చిత్రం దయామయులు. ఈ సినిమా 1987లో విడుదలైంది. అక్కడి నుంచి ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. తాజాగా మలయాళ స్టార్ మోహన్‌లాల్ సరసన ఆమె మనమంతా అనే సందేశాత్మక చిత్రంలో నటించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. అయితే వీరి బంధానికి గౌతమి ఇంత అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వీరు విడిపోవడానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు.

సారిక కూతురైన శృతి:

సారిక కూతురైన శృతి:

కమల్ హాసన్ రెండవ భార్య సారిక కూతురైన శృతి హాసన్..గౌతమి మధ్య ఫైటింగ్ జరిగినట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. కమల్ హాసన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'శభాష్ నాయుడు'. ఈ చిత్రంలో కమల్ కూతురిగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా గౌతమి వర్క్ చేస్తోంది. గౌతమి డిజైన్‌ చేసిన కాస్ట్యూమ్స్ నచ్చకపోవడంతో షూటింగ్‌ జరుగుతున్న సెట్‌లోనే శ్రుతిహాసన్‌, గౌతమి ఇద్దరూ తిట్టుకున్నారని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. మొత్తంగా బ్రేక్ అప్ కి కారణం ఇదే కాకపోయినా ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి అయ్యిండవచ్చని అనుకుంటున్నారు.

English summary
Actress Gautami reveals news of her split with superstar Kamal Haasan after 13 years of a live-in relationship.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu