twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాల్లో గెలవడమంటే ముఖ్యమంత్రి అయిపోవడమా?? రజినీకాంత్ కి కమల్ హాసన్ ఘాటు రిప్లయ్

    తమిళ సినిమాలకంటే రాజకీయాలే ఇంట్రస్టింగా ఉంటున్నాయి., తను స్థాపించబోయే పార్టీ మీద రజనీకాంత్ వ్యాఖ్యలపై ఓ ఆర్టికల్ ద్వారా కమల్ స్పందించారు. రాజకీయాల్లో గెలుపు మాత్రమే ముఖ్యం కాదని అన్నారు.

    |

    తమిళ రాజకీయాల్లో ఉన్న అనిశ్చితిని చూస్తూంటే ఇప్పటికిప్పుడే ఎన్నికలు వచ్చినంత ఉత్కంఠ కనిపిస్తోంది. మొదటినుంచీ తమిళ రాజకీయాల్లో సినీనటుల ప్రమేయం ఎక్కువ గానే ఉంటుంది. అప్పటి ఎంజీఆర్ నుంచీ ఇప్పటి తరం నటులవరకూ రాజకీయాలతో ఏదో ఒక రకమైన సంబంధం కలిగి ఉన్నవాళ్ళే. జయలలిత మరణం నుంచీ అటు రజినీకాంత్, ఇటు కమల్ హసన్ "ప్రజాసేవ" చేయటానికి తెగ తాపత్రయపడిపోతున్నారు. ఒకళ్ళమీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటమూ మొదలయ్యింది. కొద్ది రోజుల కిందటే తన పార్టీలోకి రజినీ వస్తే తీసుకుంటానంటూ చెప్పి తలైవా అభిమానుల ఆగ్రహానికి గురైన కమల్ ఇప్పుడు ప్లేట్ నీట్ గా తిప్పేసాడు...

    కమల్ రాజకీయాలకు పనికి రాడు

    కమల్ రాజకీయాలకు పనికి రాడు

    వచ్చే నెల కొత్త పార్టీని స్థాపించే యోచనలో విలక్షణ నటుడు కమలహాసన్ ఉన్నాడన్న వార్త చాలారోజులుగా వినిపిస్తున్నదే. ఒక పక్క సొంత అన్నయ్య చారూ హసనే స్వయంగా తన తమ్ముదు కమల్ రాజకీయాలకు పనికి రాడని చెప్పినా కూడా కమల్ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గటం లేదు.

    శివాజీ గణేశన్ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు

    శివాజీ గణేశన్ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు

    పార్టీ మొదలు పెట్టే అంశంపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ మాట్లాడుతూ, శివాజీ గణేశన్ కూడా పార్టీ పెట్టి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారని అన్నారు. డబ్బు, హోదాతో రాజకీయాల్లో గెలవలేమని, దానికి మించి ఉండాలని, ఈ విషయం కమల్ కు కూడా తెలుసని చెప్పారు.

     కమల్ స్పందన

    కమల్ స్పందన

    తాజాగా, రజనీ వ్యాఖ్యలపై ఓ ఆర్టికల్ ద్వారా కమల్ స్పందించారు. రాజకీయాల్లో గెలుపు మాత్రమే ముఖ్యం కాదని అన్నారు. రజనీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలనుకుంటే, నేరుగా ఆయనకే ఫోన్ చేసి చెప్పవచ్చు కదా అని కొందరు తనను అడగవచ్చని... తమ మధ్య ఉన్న స్నేహానికి అలాంటి క్లారిటీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

    రాజకీయాల్లో గెలవడమంటే

    రాజకీయాల్లో గెలవడమంటే

    తమ స్నేహం చాలా గొప్పదని, ఇది చాలా మందికి అర్థం కాదని అన్నారు. రాజకీయాల్లో గెలవడమంటే... అభ్యర్థులను ఎంపిక చేసి, మెజారిటీతో గెలిచి, ముఖ్యమంత్రి అయిపోవడమేనా అని ప్రశ్నించారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా, వారికి మంచి చేయడం కూడా గెలుపేనని చెప్పారు. రాజకీయ చరిత్రలో మనం గుర్తుంచుకోవాల్సింది కేవలం అంబేద్కర్ ను మాత్రమేనని అన్నారు.

    English summary
    Now, replying to Rajinikanth’s point of view on being victorious in politics, Kamal has registered his thoughts in his political series ‘Ennul Mayyam Konda Puyal’ in Ananda Vikatan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X