»   » డిఫెరెంట్ ఎంటర్టైన్మెంట్ ...( 'ఉత్తమ విలన్‌' ప్రివ్యూ)

డిఫెరెంట్ ఎంటర్టైన్మెంట్ ...( 'ఉత్తమ విలన్‌' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కమల్ సినిమా అంటేనే ఓ స్పెషాలిటీ. ఏ ప్రత్యేకతా లేకుండా ఆయన సినిమాలు తీయరనేది అందరికీ తెలిసిందే. దాంతో టైటిల్, ప్రోమోలు,పోస్టర్లు చాలా విభిన్నంగా ప్రెజెంట్ చేయటంతో 'ఉత్తమ విలన్‌' కోసం సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన విభిన్నమైన గెటప్ లు ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దివంగత దర్శకుడు బాలచందర్ కీలక పాత్రలో కనిపించటం ఆయన అబిమానులకు పండుగ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ సినిమాలో ఉత్తమన్‌ అనే 8వ శతాబ్ధం నాటి కళాకారుడి పాత్రలో, మనోరంజన్‌ అనే 21వ శతాబ్ధపు సినిమా స్టార్‌ పాత్రలో కమలహాసన్‌ నటించారు. ప్రతి ఒక్కరిలోనూ విలన్‌ ఉంటారు. ఆయా పరిస్థితులే వాళ్లని విలన్‌లుగా మారుస్తాయి. ఎవరి దృష్టిలో ఎప్పుడెవరు ఎలా కనిపిస్తారన్నదే ఈ చిత్రం. ఒక సినిమా కళాకారుడి జీవితం నేపథ్యంలో తెరకెక్కింది.


Kamal Haasan Starrer 'Uttama Villain' ('Uthama Villain') Preview

తమిళనాడులో 400లకు పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. తెలుగులోనూ అదే స్ధాయిలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 1500 పైగా థియేటర్లలో విడుదలకానున్నట్లు సమాచారం.


చిత్ర దర్శకుడు రమేష్‌ అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో కమల్‌హాసన్‌గారు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌ (ప్రత్యేకమైన మేకప్‌తో కేరళలో ప్రదర్శించే పురాతన కళ)గా, సినిమా ఆర్టిస్ట్‌గా రెండు పాత్రల్లోనూ మెప్పిస్తారు. తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి ఆయన ఎక్కువగా శ్రమించారు. ఆ పాత్రకు మేకప్‌ వేసుకోవడానికి దాదాపు నాలుగు గంటలు పట్టేది. కె.బాలచందర్‌, కె.విశ్వనాథన్‌ ఇందులో కీలక పాత్రలను పోషించారు. వాళ్లను దర్శకత్వం వహిస్తూ చాలా విషయాలను నేర్చుకున్నాను'' అని తెలిపారు.


కమల్ హాసన్ మాట్లాడుతూ... '' ఉత్తమ విలన్ లో రకరకాల వేషాలున్నాయి. ఏ వేషమైనా కథ, పాత్ర డిమాండ్‌ చేసినప్పుడే వేయాలి. నాకు నేనుగా పనిగట్టుకొని ఎప్పుడూ గెటప్‌ కోసం ప్రయత్నించను. ఈ పాత్ర చేయడానికి చాలా మంది నటులు స్ఫూర్తి, అందులో నేనూఒకణ్ని. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. కథని చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది.''.


అలాగే... 'ఉత్తమ విలన్‌' కోసం చాలా కష్టపడ్డాం. ఇందులో ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్‌ డ్యాన్స్‌ కొత్తగా ఉంటుంది. భారతీయ సినిమాల్లో ఇప్పటిదాకా అలాంటి డ్యాన్స్‌తో పాట రూపుదిద్దుకోలేదని సగర్వంగా చెబుతాను. హాలీవుడ్‌ సినిమాల్లోని స్పష్టత అందులో కనిపిస్తుంది. వంద శాతం కమర్షియల్‌ కోణంలో తెరకెక్కిన చిత్రమిది. సినిమాని కళారూపం, వాణిజ్య రూపం అని విడదీసి చూడలేం. డబ్బు పోయినా ఫర్వాలేదు అని ఎవ్వరూ సినిమా చేయరు. సత్యజిత్‌రేగారు కూడా విజయం వస్తే వద్దనలేరు. నాకు అవార్డు చాలని ఆయన చెప్పరు'' అని అన్నారు.


ఇక గురువుగారు బాలచందర్‌తో పాటు, కె.విశ్వనాథ్‌గారితో కలిసి ఇందులో నటించా. వాళ్లతో ఇదివరకు చాలా సినిమాల్లో నటించా. బాలచందర్‌గారి దర్శకత్వంలో 36 సినిమాలు చేశాను. తొలి 5, 6 సినిమాల వరకు ప్రతిదీ ఆయనే నేర్పించేవారు. వారిద్దరినీ రెండు పరిశ్రమల్లోనూ ఎంతో ఆరాధిస్తారు. వాళ్ల పిల్లలమే మేము. నటన అనే జన్యు సంబంధం మా మధ్య ఉంది అని చెప్పారు.


బ్యానర్:సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌
నటీనటులు: కమల్ హాసన్, ఆండ్రియా, పూజా కుమార్‌, కె.బాలచందర్‌, విశ్వనాథ్‌, జయరాం, నాజర్‌, వూర్వశి, ఎం.ఎస్‌.భాస్కర్‌, పార్వతి, చిత్ర, లక్ష్మణన్‌ తదితురులు
సంగీతం :ఎం. ఝిబ్రాన్
ఛాయాగ్రహణం: శ్యాం దత్
ఎడిటింగ్ :విజయ్ శంకర్
స్టూడియో: తిరుపతు బ్రదర్స్,రాజ్‌కమల్ ఇంటర్నేషనల్
సమర్పణ :ఈరోస్ ఇంటర్నేషనల్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కమలహాసన్‌
దర్శకత్వం :రమేష్‌ అరవింద్‌
నిర్మాత: సి కళ్యాణ్


విడుదల తేదీ: మే 1, 2015.

English summary
"Uttama Villain", starring Kamal Haasan and directed by Ramesh Aravind, will be released today (1 May). "Uttama Villain", which is a comedy drama, is being touted as the most iconic flick of Kamal Haasan. Ulaganayagan will portray characters of an eighth century drama artist (Uthaman) and a 21st century film star (Manoranjan).
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu