twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఢిల్లీ రేపిస్టులకు మరణశిక్ష: వ్యతిరేకిస్తున్న కమల్ హాసన్

    By Bojja Kumar
    |

    చెన్నై: ఢిల్లీ రేపిస్టులకు మరణ శిక్ష విధించాలంటూ దేశ వ్యాప్తంగా ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుంటే....... మరో వైపు స్టార్ హీరో కమల్ హాసన్ మాత్రం వారికి మరణ శిక్ష విధించడం అనే అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ రేప్ ఘటన సిగ్గుచేటు అని వ్యాఖ్యానిస్తూనే..... రేపిస్టులకు మరణశిక్ష వేయడం సరికాదు అంటూ వాదిస్తున్నాడు.

    ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... 'రేపిస్టులకు మరణశిక్ష విధించాలని జరుగుతున్న చర్చకు నేను పూర్తిగా వ్యతిరేకం, ఇది సరైది కాదు. అలా చేస్తే ఒక నేరాన్ని అరికట్టడానికి మరో నేరం చేసినట్లే. మరణశిక్ష విధించడం అనేది.... న్యాయ పరంగా చేసే హత్యే అవుతుంది' అని వ్యాఖ్యానించారు.

    23 ఏళ్ల పారామెడికల్ స్టూడెంట్‌పై డిసెంబర్ 16న ఢిల్లీలోని బస్సులో గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో దశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శని, ఆది వారాల్లో ఆందోళనలు మరింత తీవ్రం అయ్యాయి. సోషల్ నెట్వర్క్ ద్వారా ఏకమైన వేలాది మంది యువకులు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.

    కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే.. కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం 'విశ్వరూపం'. జనవరి 11న విశ్వరూపం చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ బాషల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే చెన్నై సమాచారం ప్రకారం సంక్రాంతి బరి నుంచి ఈ చిత్రం తప్పుకుంది. అయితే తమిళం, హిందీ వెర్షన్లలో మాత్రం ముందుగా అనుకున్న తేదీలోనే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ విడుదల మాత్రమే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జనవరి చివరి వారంలో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలోగానీ ఆంధ్రప్రదేశ్‌లో 'విశ్వరూపం' విడుదలయ్యే అవకాశం ఉంది. ఇతర తెలుగు సినిమాల పోటీ ఉండటమే ఇందుకు కారణం.

    English summary
    Renowned actor Kamal Hassan said that he was ashamed of the gang-rape of the 23-year-old girl in Delhi, but was against awarding death penalty to rapists.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X