Don't Miss!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఆ సినీ క్రిటిక్ అకౌంట్ క్లోజ్: ట్విట్టర్‌కి పట్టిన పీడ వదిలింది అంటూ అభిమానుల హర్షం
సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ చూసుకుని తనకు తాను గొప్ప క్రిటిక్‌గా ఫీలైపోయే కమల్.. పబ్లిసిటీ కోసం సెలబ్రెటీల మీద అవాకులు చెవాకులు పేలుతుంటాడు. ఆ మధ్య మన సౌత్ స్టార్లను కూడా అతను టార్గెట్ చేశాడు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' హిందీలో రిలీజైన సమయంలో కమల్ పవన్‌ను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు కమల్ ఖాన్.

విమర్శించడమే పనిగా
ఈయన స్టార్ హీరోలను విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. అవడానికి బాలీవుడ్ రివ్యూ రైటరే అయినా తెలుగు సినిమాలను కూడా వదలరు. జాతీయ స్థాయిలో ఎందరో మెప్పు పొందిన బాహుబలి సినిమానూ విమర్శించారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్‌ను కూడా వదల్లేదు.

పవన్ మీద పిచ్చి కామెంట్స్
కమేడియన్ ఆఫ్ బాలివుడ్ గా కొందరి చేత పిలవబడే కమాల్ ఆమధ్య సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మీద పిచ్చి కామెంట్స్ చేశాడు. అసలు ఇలాంటి జోకర్, కార్టూన్ లాంటి హీరో కంటే రాజ్ పాల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూడటానికి ప్రిఫర్ చేస్తాను.

పవన్ కళ్యాణ్ ఒక కార్టూన్
సౌత్ ఇండియన్ పీపుల్ కు ఏమైంది. ఇలాంటి కార్టూన్ ను సినిమాల్లో హీరోగా ఎలా చూస్తారు..? వెరీ బ్యాడ్ ఛాయిస్. ఇతనే హీరో అంటే, ప్రపంచంలో ఎవరైనా హీరో అయిపోవచ్చు అంటూ ట్వీట్లు పెట్టి సౌత్ ఇండియాలోనూ పాపులర్ అయ్యాడు. అదేమిటో ఎవరై మీదైనా రెచ్చిపోయే పవన్ అభిమానులు కమల్ ఖాన్ కి మాత్రం భయపడిపోయారు.

ప్రభాస్ ఒంటెలా ఉంటాడనీ, రానాకి బుద్దిలేదనీ
అంతే ఇక సౌత్ ఇండియన్ జనాలు మరీ చీప్ గా కనిపించినట్టున్నారు వరుసగా, ప్రభాస్ ఒంటెలా ఉంటాడనీ, రానాకి బుద్దిలేదనీ, మోహన్ లాల్, రజినీకాంత్ లాంటి దిగ్గజాలను కూడా వదలకుండా తన విమర్శలను అంతులేకుండా చేస్తూ పోతూనే ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలనే వదల్లేదంటే.. బాలీవుడ్ స్టార్ హీరోలను వదలుతాడా? విమర్శనాస్త్రాలను భారీగా సంధిస్తూనే ఉంటాడు.

సీక్రెట్ సూపర్ స్టార్
అయితే కావాలని చేసిన విమర్శలని తెలిపోయేంత పలుచగా ఉంటాయి ఇతని విమర్శలు, కొన్ని సార్లైతే మరీ హద్దు మీరుతాయి కూడా. ఇటీవల అమీర్ ఖాన్ హీరోగా నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా క్లైమాక్స్‌ను రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో రివ్యూ రాశాడు. అది కూడా సినిమా విడుదలకు ముందే.

కమల్ ట్విట్టర్ అకౌంట్ క్లోజ్
దీంతో అమీర్ ఖాన్ అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ ట్విట్టర్ అకౌంట్‌ను నిర్వాహకులు క్లోజ్ చేశారు. హిందీ సినిమాలు భారత్‌లో విడుదలవడానికి ముందే దుబాయ్‌లో ప్రీమియర్ షో చూసేసి, వెకిలి రివ్యూలు రాసే కేఆర్‌కే అకౌంట్‌ను నిలిపివేయడంతో చాలా మంది సినీ ప్రియులు పండగ చేసుకున్నారు.

దీపావళికి ట్విట్టర్ బహుమతి
ఈ దీపావళికి ట్విట్టర్ చక్కని బహుమతినిచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌కి పట్టిన పీడ వదిలిందని, కలుపు మొక్కలను ట్విట్టర్ ఏరిపారేస్తోందని కామెంట్లు చేశారు. ఇందుకే మరి చేతిలో కీబోర్డ్ ఉంది కదా అని రెచ్చిపోతే ఇలాగే బయటికి గెంటుతారు. ఈ వెకిలి రాతల క్రిటిక్ కాని క్రిటిక్ ఇప్పటికైనా మారతాడేమో...