»   » హాస్పిటల్ బెడ్‌పై సూపర్‌స్టార్.. ఆయన దీనపరిస్థితి చూసి భోరున ఏడ్చాను..

హాస్పిటల్ బెడ్‌పై సూపర్‌స్టార్.. ఆయన దీనపరిస్థితి చూసి భోరున ఏడ్చాను..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ వినోద్‌ఖాన్నా ఆరోగ్య పరిస్థితిపై నటుడు, నిర్మాత, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. వినోద్ ఖన్నా పరిస్థితిని చూసి తాను తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్ల వినోద్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరిన సంగతి తెలిసిందే.

వినోద్‌ఖాన్నాకు పరామర్శ

హాస్పిటల్ చికిత్స పొందుతున్న వినోద్ ఖాన్నాను ఇటీవల కమల్ ఖాన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకనాటి సూపర్ స్టార్ వినోద్ ఖన్నాను దీనస్థితిలో చూసి కంటతడి పెట్టాను అని అన్నారు. ఆస్పత్రిలో ఉన్న వినోద్ ఖన్నా ఫోటోను కమల్ ట్వీట్ చేశారు.

ఐసీయూలో చికిత్స

ఐసీయూలో చికిత్స

గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల తీవ్ర డిహైడ్రేషన్‌కు గురయ్యారు. దాంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్చారు. వినోద్ ఖాన్నా పరిస్థితి విషమించడంతో ఐసీయూలోకి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వినోద్ ఖన్నా కుమారుడు రాహుల్ తండ్రి ఆరోగ్యం గురించి మీడియాకు వివరించారు.

త్వరలో విడుదల చేస్తామని..

త్వరలో విడుదల చేస్తామని..

శుక్రవారం అనారోగ్యంతో వినోద్ ఖన్నా హాస్పిటల్‌లో చేరారు. వెంటనే సరైన చికిత్స అందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. త్వరలోనే ఆయనను విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు అని రాహుల్ పేర్కొన్నారు.

అలనాటి సూపర్ స్టార్

అలనాటి సూపర్ స్టార్

బాలీవుడ్‌లో వినోద్ ఖన్నా (70) ఇప్పటివరకు 141 చిత్రాల్లో నటించారు. హెరాఫెరీ, ఖూన్ ఫసీనా, అమర్ అక్బర్ ఆంథోని, పర్వరీష్, మేరా గావ్ మేరా దేశ్ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చాందిని చిత్రంలో శ్రీదేవి పక్కన హీరోగా కూడా నటించారు. చివరిసారిగా షారుక్, కాజల్ నటించిన దిల్‌వాలేలో కనిపించారు. గతంలో బీజేపీ తరుఫున ఎంపీగా ఎన్నికై ప్రజాసేవ చేశారు. వినోద్ ఖాన్నాకు రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖాన్నా ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్షయ్ ఖన్నా పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించారు.

English summary
Veteran actor Vinod Khanna was hospitalised due to severe dehydration. Actor, writer Kama R Khan visited hospital to see him. After visit, Kamal R Khan tweeted that I am really crying after seeing my most favourite super star Vinod Khanna Sahab in this situation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu