twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం-2': కమల్ నిర్ణయంతో మళ్లీ వివాదం?

    By Srikanya
    |

    హైదరాబాద్ : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం 'విశ్వరూపం-2'. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్దితుల్లోనూ 'డీటీహెచ్'లో (డెరైక్ట్ టు హోమ్) విడుదల చేస్తానని కమల్ చెప్తున్నారు. గతంలో 'డీటీహెచ్'లో ప్రకటించగానే భారీ ఎత్తున వివాదం చెలరేగింది. థియేటర్లో విడుదల చేసిన రోజునే టీవీల్లో సినిమా వచ్చేస్తే మా పరిస్ధితి ఏంటి అంటూ తమిళనాడులోని ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకించి బ్రేక్ వేసారు. కానీ, ఇప్పుడు 'విశ్వరూపం 2'ని ఈ విధానం ద్వారా విడుదల చేయాలని కమల్ అనుకుంటున్నారు.

    కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' ఈ ఏడాది సంచలన విజయాల్లో ఒకటిగా నిలచింది. ముగింపులో 'విశ్వరూపం-2' కోసం వేచి చూడండి అంటూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన కమల్‌ ప్రస్తుతం సీక్వెల్‌ను పూర్తి చేసేందుకు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒకవేళ ఇక్కడ కుదరకపోతే యూఎస్‌లో అయినా ఈ విధానంలో విడుదల చేయాలన్నది కమల్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    ఈ రెండో భాగంలో కథ చాలా వరకూ మన దేశం నేపథ్యంగానే సాగుతుంది. త్వరలో ఢిల్లీలో కొన్ని ఘట్టాలు చిత్రించబోతున్నారు. 'విశ్వరూపం 2'ని ఆగస్టులో విడుదల చేయాలన్నది కమల్‌హాసన్‌ ఆలోచన. తొలి భాగంలోని నటీనటులు చాలామంది కొనసాగింపులోనూ నటిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తెరపై 'విశ్వరూపం'లో ఆవిష్కరించారు కమల్‌హాసన్‌. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన ఆ చిత్రం పలు వివాదాలను సృష్టించింది.

    ప్రస్తుతం కమల్‌ 'విశ్వరూపం 2' చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. దీన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం. ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

    కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.

    English summary
    Kamal Haasan plans to release the sequel of Vishwaroopam, titled Vishwaroopam 2 on DTH. He said that TV premiere of a film is a step into the future. If India won't permit then he plans to take the film abroad. He plans to release Vishwaroopam 2 on DTH in the US.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X