twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమ్మ కాపు... సాంగ్ తొలగింపు: ‘వంగవీటి’ మూవీ ఇష్యూపై మెట్టు దిగిన వర్మ!

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.... తను తీసే సినిమాలు దాదాపుగా వివాదాస్పద అంశాల మీదే తీస్తుంటారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.... తను తీసే సినిమాలు దాదాపుగా వివాదాస్పద అంశాలను బేస్ చేసుకుని తీస్తుంటారు. గతంలో పరిటాల రవి జీవితం నేపథ్యంలో తెరకెక్కించిన రక్త చరిత్ర, తర్వాత బెజవాడ రౌడీయిజం మీద తీసిన బెజవాడ రౌడీలు లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం.

    తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం 'వంగవీటి. ఈ సినిమా వంగవీటి మోహన రంగ జీవితం ఆధారంగా తీరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఒకప్పుడు విజయవాడలో రెండు కులాలకు చెందిన కొందరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటల నేపథ్యంలో తెరకెక్కుతుందని ముందు నుండీ ఓ ప్రచారం జరుగుతోంది.

    సినిమాకు హైప్ తేవడానికే అన్నట్లుగా.... కమ్మ కాపు అంటూ ఓ సాంగ్ కూడా సినిమాలో పెట్టారు. సినిమా షూటింగ్ దశలో ఉన్నపుడే ఈ సాంగును యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేసారు.

    నోటీసులు

    నోటీసులు

    వాస్తవాలకు విరుద్ధంగా సినిమాను నిర్మిస్తున్నారంటూ వంగవీటి మోహనరంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్వియంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ రెడ్డికి కోర్టు నోటీసులు అందజేసింది. దీంతో దర్శకుడు వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దిగిరాక తప్పలేదు.

    పాటను తొలగిస్తున్నట్లు ప్రకటన

    పాటను తొలగిస్తున్నట్లు ప్రకటన

    పాట తొలగించకపోతే కోర్టు చిక్కులతో పాటు సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో కూడా ఇబ్బందిర ఏర్పడే పరిస్థితి రావడంతో ..... స్వచ్ఛందంగా ఈ పాటను తొలగిస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.ఈ సినిమా భావోద్వేగాలతో కూడుకున్నదని... ఏ ఒక్కరికీ సంబంధించినది కాదని వర్మ ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు.

    మెట్టు దిగిన వర్మ

    మెట్టు దిగిన వర్మ

    నా సినిమాలు నా ఇష్టం వచ్చినట్లు తీస్తాను, ఎవరి కోసమో నా నిర్ణయాలు మార్చుకోను అంటూ... మొండిగా వాదించే వర్మ ఈ విషయంలో మాత్రం మెట్టు దిగక తప్పలేదు. రేపు(డిసెంబర్ 3)న వంగవీటి ఆడియో వేడుక విజయవాడలో జరుగుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    యూట్యూబులో

    కమ్మ...కమ్మ... కమ్మ..కమ్మ కమ్మనైనా పగా...కమ్మేసింది..కుమ్మేసింది కత్తులు దూసే దాకా...
    కాపు..కాపు కాపు..కాపు కాపుగాసే వేళా... కసిరేపింది..కర్కశమంత కొడవలి గుచ్చే దాగా...
    అడ్డులేనిది..హద్దులేనిదీ ఈ పోరూ.. ఆపలేకనే చూస్తూ ఉంది అమ్మోరూ...
    వంగవీటి..వంగవీటి వంగవీటి..వంగవీటి వంగవీటి..వంగవీటి

    బెజవాడ దారుణాలకు అతడే సాక్షి: డిసెంబర్ 3న వర్మ ఏం చెబుతాడో?

    బెజవాడ దారుణాలకు అతడే సాక్షి: డిసెంబర్ 3న వర్మ ఏం చెబుతాడో?

    విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Creative director Ram Gopal Varma’s latest sensation Vangaveeti in the production of Dasari Kiran Kumar on Ramadhutha Creations banner is continuously in news. In the wake of High Court issued notices to Varma and Dasari Kiran stopping the issue of censor certificate, maker5s have decided to remove Kamma Kaapu song. “Respecting the appellants in court we are voluntarily removing the KAMMA KAAPU song from the film Vangaveeti with immediate effect. Though shall not continue its usage in any form or manner whatsoever, we the makers of Vangaveeti decide ahead of court hearing posted on 2.12.2016,” said producer Dasari Kiran and director Ram Gopal Varma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X