»   » 'భాయ్‌' లో కామ్నా కామ్నా జెఠ్మలానీ పాత్రేంటి?

'భాయ్‌' లో కామ్నా కామ్నా జెఠ్మలానీ పాత్రేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : వరసగా ఆ మధ్య సినిమాలు చేసిన కామ్నా జెఠ్మలానీ రీసెంట్ గా పెద్దగా ఆఫర్స్ లేక డల్ అయ్యింది. ఆమెకిప్పుడు 'భాయ్‌'లో నటించే అవకాశం దక్కింది. ఇందులో ప్రత్యేక పాత్రకు కామ్నాని తీసుకొన్నారు. పాతబస్తీలో ఉండే యువతిగా కనిపిస్తుందని సమాచారం. ఆమెకు నాగార్జున కి వచ్చే సన్నివేశాలు కామెడీని బాగా పండిస్తాయని చెప్తున్నారు.


నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం 'భాయ్‌' . రిచా గంగోపాధ్యాయ హీరోయిన్. వీరభద్రమ్‌ చౌదరి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ సాగుతోంది. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని చెప్తున్నారు.
వీరభద్రం తనదైన శైలిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌గోపాల్‌వర్మ 'డిపార్ట్‌మెంట్' ఫేం నథాలియాకౌర్‌పై ఆ మధ్య ఐటం సాంగ్ చిత్రీకరించారు.

నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.

English summary
Nagarjuna's ‘Bhai’ is progressing at brisk pace in the direction of Veerabhadram. According to information film makers roped in Kamna Jethmalani for an important role. The role will have a vamp shades. Film also stars Hamsa Nandini, Sonu Sood, Nathalia Kaur are starring in the film produced on Annapurna Studios. Devi Sri Prasad is the music director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu