»   » ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘కంచె’?

ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘కంచె’?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా రొటీన్ సినిమాలే వస్తుంటాయి. అప్పుడప్పుడు మాత్రమే ‘కంచె' లాంటి పాత్‌బ్రేకింగ్ సినిమాలు వస్తుంటాయి. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె' చిత్రాన్ని ఇటు ప్రేక్షకుల నుండి, అటు సినీ విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ చిత్రాన్ని రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ సినిమా చూడటానికి మాత్రం రూ. 50 కోట్ల సినిమాలా రిచ్ లుక్ వచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా కోసం దర్శకుడు పడ్డ కష్టం వృధా కాలేదు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెలుతోంది.


Kanche going for film festivals?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్ ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా జరిగే పలు ఫేమస్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి ఈ సినిమాను పంపాలనే ఆలోచనలో ఉన్నాడు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్దం నాటి కొన్ని పరిస్థితులను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.


తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు... ఇండియన్ సినిమా పరిశ్రమలోనే ఇప్పటి వరకు రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సినిమా రాలేదు. అప్పటి యుద్ధవాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపడంలో దర్శకుడు క్రిష్ సఫలం అయ్యాడు.

English summary
As per te latest reports, Krish is contemplating sending Kanche to several International film festivals. Kanche’s World War II backdrop will act as an added advantage to impress the film festival circuits.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu