»   » సింగిల్ గా ఉంటూ సుఖం వెతుక్కుంటున్న ప్రబాస్ హీరోయిన్

సింగిల్ గా ఉంటూ సుఖం వెతుక్కుంటున్న ప్రబాస్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో చేసిన కంగనా రనౌత్ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా పెళ్ళి, సుఖం, రిలేషన్ షిప్ విషయాలపై మాట్లాడుతూ...నేను రిలేషన్ షిప్ లోకి వెళ్ళాలని కంగారుపడటం లేదు. సింగిల్ గా ఉంటూనే సుఖంగా ఉందనిపిస్తోంది. ఇలాగే కొనసాగాలనిపిస్తోంది. ఇక వివాహం అంటారా..ప్రస్తుతం నా కెరీయర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. నేను ఇంకా పెళ్ళికి రెడీ కాలేదు. నా దృష్టి అంతా ప్రస్తుతం సినిమాల మీదే ఉంది. అయినా పెళ్ళి,ప్రేమ వంటి విషయాలు మనం ప్లాన్ చేస్తే కుదరదు. వాటంతట అవే టైమ్ వచ్చినప్పుడు కలిసివస్తాయి. అయినా సింగిల్ ఉండటం తప్పేమీకాదు అంటూ ముగించింది. పెళ్ళి అవసరం లేనప్పుడు సింగిల్ గా ఉన్నా నడిచిపోతుందంటున్నారు ఇది విన్న బాలీవుడ్ జనం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu