»   »  హీరోలు హీరోయిన్లను వాడుకుంటున్నారు, ఇదే నిజం.... మాట మార్చను!

హీరోలు హీరోయిన్లను వాడుకుంటున్నారు, ఇదే నిజం.... మాట మార్చను!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే అమ్మాయిల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, వారిని అనేక రకాలుగా హీరోలు, నిర్మాతలు, దర్శకులు వాడుకుంటారనే ప్రచారం కూడా ఉంది.

అవును... ఇలాంటి జరుగుతున్న మాట నిజమే, నేను కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాను, ముఖ్యంగా కొందరు హీరోలు హీరోయిన్లను వాడుకుంటారు అంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.

తాజాగా ఆమె మరో ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని నొక్కి వక్కానించారు. నేను చేసిన ఆ కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానను, ఎందుకంటే అదే వాస్తవం. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్నూ వాడుకున్నారు అంటూ ఆమె స్పష్టం చేసారు.

 నన్నూ వాడుకున్నారు

నన్నూ వాడుకున్నారు

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను కూడా అలాంటి చేదు అనువాలు ఎదుర్కొన్నాను. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన వారుతప్ప దాదాపుగా అందరు హీరోయిన్ల పరిస్థితి అంతే. ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా స్టార్‌ హీరోయిన్లుగా ఎదిగిన వారంతా తప్పకుండా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఉంటారు అని కంగనా వ్యాఖ్యానించారు.

 నిజం కాబట్టే అంతా సైలెంట్

నిజం కాబట్టే అంతా సైలెంట్

ఇవన్నీ నేను కల్పితంగా చెబితే తప్పు అవుతుంది. నేను స్వయంగా అనుభవించాను, కొందరిని స్వయంగా చూసారు. వారి పేర్లను నేను బయట పెట్టదలుచుకోలేదు. నా కామెంట్స్ ను తప్పుబట్టే దమ్ము ఎవరికీ లేదు, నా కామెంట్స్ నిజం కాబట్టే... ఎవరూ దానిపై మాట్లాడటానికి ముందుకు రాడం లేదు అని కంగనా రనౌత్ అన్నారు.

 నిజం నిప్పులాంటిది

నిజం నిప్పులాంటిది

నేను నిజాలు మాత్రమే మాట్లాడతాను, అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలే మాట్లాడతాను, అబద్దాలు చెప్పే అలవాటు నాకు లేదు. నిజం నిప్పులాంటిది... నిజాలు మాట్లాడతాను కాబట్టే తప్పు చేసిన వారికి నేనంటే భయం. భయపడని వారితోనే నేను స్నేహం చేస్తాను. స్త్రీలకు స్వేచ్ఛ అంటూ చాలా మంది మాట్లాడతారు... నేను ఇలా నిజాన్ని స్వేచ్ఛగా మాట్లాడితే రకరకాలుగా కామెంట్స్ చేస్తారు అని కంగనా రనౌత్ తనదైన రీతిలో స్పందించారు.

 అవమానాలు ఎన్నో

అవమానాలు ఎన్నో

నేను హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టనణం నుండి వచ్చాను. ముంబైకి వచ్చిన కొత్తలో నేను మాట్లాడే ఇంగ్లీష్, నా డ్రెస్సింగ్ సెన్స్ చూసి అంతా నవ్వే వారు, అవమానంగే ఉండేది. పట్టుదలతో నా వేషం, భాష మార్చుకున్నాను....నన్ను చూసి నవ్విన వారి నోళ్లు మూయించాను. స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చాను అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.

 గొప్పగా భావిస్తున్నాను

గొప్పగా భావిస్తున్నాను

ఇప్పుడున్న స్టార్‌ హీరోయిన్లందరికీ సినీ బ్యాక్‌గ్రౌండూ లేదా కుటుంబం అండా ఉన్నాయి. నా విషయానికి వస్తే ఆ రెండూ లేవు. అలాంటి స్థితి నుంచి వచ్చి బాలీవుడ్‌ క్వీన్‌ అనిపించుకోవడం గొప్పగా భావిస్తున్నాను అని కంగనా చెప్పుకొచ్చారు.

 నా వల్ల అయితేనే చేస్తాను

నా వల్ల అయితేనే చేస్తాను

ఎవరైనా ఒక మంచి కథతో వస్తే ముందు ఆ పాత్ర నేను చేయగలనో లేదో అంచనా వేసుకుంటాను. నేను చేయగలనని అనుకున్న పాత్రనే ఒప్పుకుంటాను. చేయలేను అనుకుంటే ఎంత డబ్బు ఇచ్చినా చేయను అని కంగనా తెలిపారు.

 రెమ్యూనరేషన్

రెమ్యూనరేషన్

పద్మావతి సినిమాకు దీపిక 13 కోట్లు తీసుకుంటోందట, మీరు 15 కోట్లు అడుగుతున్నారట... నిజమేనా? అనే ప్రశ్నకు కంగనా రనౌత్ సమాధానం ఇస్తూ... నా ఇష్టం వచ్చినంత అడుగుతాను, ఒక సినిమాకి ఎంత తీసుకోవాలి అన్నది హీరోయిన్‌ ఇష్టం. ఆ సినిమాకి దీపిక అంతే తీసుకుంటోంది కదా? మీరు అంత అడుగుతున్నారెందుకు? లాంటి ప్రశ్నలకు జవాబులు ఉండవు, వాళ్లు ఇవ్వ గలిగే స్థితిలో ఉన్న వారే నాతో సినిమా చేస్తారు అని తెలిపారు.

 క్వీన్ మూవీ కంటే ఎక్కువ పేరు తెచ్చే మూవీ

క్వీన్ మూవీ కంటే ఎక్కువ పేరు తెచ్చే మూవీ

ప్రస్తుతం నేను చేస్తున్న ‘రాణి లక్ష్మీబాయి' సినిమా నాకు చాలా ప్రత్యేకం. . ‘క్వీన్‌' నాకు ఎంత పేరు తెచ్చిందో అంతకు మించిన పేరు తెస్తుంది ఈ సినిమా. డూప్ లేకుండా నేనే గుర్రపు స్వారీ చేస్తానని చెప్పాను. ఇందుకోసం జర్మనీలో గుర్రపు స్వారీ శిక్షణ పొందాను. వివిధ జాతుల గుర్రాల గురించీ, వాటి అలవాట్లు, ఎప్పుడు ఎలా స్పందిస్తాయి అన్న విషయాలు తెలుసుకున్నాను. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా తీసుకున్నాను.

 పెళ్ళి ఆలోచన

పెళ్ళి ఆలోచన

అసలు పెళ్ళి గురించిన ఆలోచన లేదు. పెళ్ళి ఎలా చేసుకోవాలి, ఎలాంటి వ్యక్తిని చేసుకోవాలి అనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అలాంటపుడు దీని గురించి మీకు మాత్రం ఏం చెప్పగలను? ఓ రెండు మూడేళ్ళ తరువాత ఈ విషయం గురించి ఆలోచిస్తాను అని కంగనా రనౌత్ అన్నారు.

English summary
Kangana Ranaut, who has given her nod to essay the role of the warrior queen, Rani Lakshmi Bai, in filmmaker Ketan Mehta’s next. "Kangana has read about Lakshmi Bai in school. So, when she was approached for the role, she was very excited. She also loved Ketan’s script, and was impressed with the kind of research that has gone into it," says an insider.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu