Don't Miss!
- News
సీఎం జగన్ -కోటంరెడ్డి మధ్య ఏం జరిగింది : గ్యాప్ మొదలైంది అక్కడేనా..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Emergency: ఇందిరా గాంధీ పాత్రలో కంగనా పరకాయ ప్రవేశం.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్
కంగనా రనౌత్ సినిమా ఎమర్జెన్సీచాలా కాలంగా వార్తల్లో ఉంది. ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేశాడు. యూట్యూబ్‌లో 1.21 సెకన్ల ఫస్ట్ లుక్‌లో, కంగనా రనౌత్ ఇందిరా గాంధీ గెటప్‌లో కొన్ని డైలాగులు మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ లుక్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.మునుపటితో పోలిస్తే ఈ లుక్ నిజానికి చాలా కన్విన్సింగ్‌గా ఉంది.ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. ఈ సినిమాలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది.ఎమర్జెన్సీ సమయాన్ని సినిమాలో చూపించారు. ఢాకడ్ ఫ్లాప్ అవ్వడంతో కంగనా ఈ సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకుంది.
ఈ టీజర్ లో కంగనా రనౌత్ ఇందిరా గాంధీ రూపాన్ని మాత్రమే కాక హావభావాలు, ఆమె భాషను సైతం విజయవంతంగా అనుకరించింది. కళ్ల జోడుతో కాటన్ చీర ధరించి కంగనా కనిపించింది. వీడియోలో కంగనాకు అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్ నుండి కాల్ రావడం, అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఆమెను సాధారణంగా సార్ అని కాకుండా మేడమ్ అని సంబోధించగలరా అని అడగడం కనిపిస్తోంది. కంగనా ఇందిర లాగానే, అవును అని చెప్పింది. కానీ ఆమె సెక్రటరీ వైపు తిరిగి, ఆఫీసులో అందరూ తనను సర్ అని పిలుస్తున్నారని అమెరికా అధ్యక్షుడికి చెప్పండి అంటూ కంగనా చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాక అందర్నీ ఆకట్టుకుంటుంది. 1977లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ గురించే సినిమా ఉంటుందనీ, అందులో తాను ఆమె పాత్రనే పోషిస్తున్నట్టు కంగనా గతంలోనే ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిల్మ్స్ బ్యానర్లోనే ఈ చిత్రం నిర్మిస్తున్నానని కూడా ఆమె ప్రకటించింది.
The epic story of Independent India’s darkest hour.
— Manikarnika Films Production (@ManikarnikaFP) July 14, 2022
As we commence shoot, sharing a glimpse of #Emergency#EmergencyFirstLookhttps://t.co/t14SjqyDEb#KanganaRanaut @nishantpitti #AkshtRanaut @writish @gvprakash @manojmuntashir pic.twitter.com/FsD0Hk3ixZ
పొలిటికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులు, అప్పటి రాజకీయ కుట్రలు, దేశం ఎదుర్కొన్న సంక్షోభం వంటివి చూపించబోతున్నట్టు చెబుతున్నారు. ఇక త్వరలోనే ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తాజాగా వెల్లడించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఒక అద్భుతమైన ప్రయాణం అని కూడా కంగనా అభివర్ణించారు. అంటే సినిమాకు తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.