»   » హీరోయిన్ కంగనకు కత్తిగాట్లు.... తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది!

హీరోయిన్ కంగనకు కత్తిగాట్లు.... తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు కత్తి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'మణికర్ణిక' సినిమా షూటింగులో భాగంగా తన కో స్టార్ నిహార్ ప్యాండ్యాతో కలిసి కత్తి యుద్ధం చేస్తుండగా కత్తి దూయడం రాంగ్ టైమింగ్ కాడంతో ఆమె మొహంపై కనుబొమ్మల క్రింది భాగంలో గాయమైంది.

  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. వెంటనే కంగనను సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. గాయం అయిన ప్రాంతంలో 15 కుట్లు పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచారు. వారం తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

  ఆగిపోయిన షూటింగ్

  ఆగిపోయిన షూటింగ్

  సినిమాలో ప్రధాన పాత్రధారి కంగన లేక పోవడంతో ‘మణికర్ణిక' షూటింగుకు బ్రేక్ పడింది. గాయం లోతుగా అయిందని, ఎముకకు దగ్గరగా కావడంతో రెండు మూడు రోజుల పాటు ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉండచనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

  Heroines Remuneration | Filmibeat Telugu
  మణికర్ణిక

  మణికర్ణిక

  ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా ‘మణికర్ణిక' చిత్రాన్ని తెలుగు దర్శకుడు క్రిష్ జగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. 'బాహుబలి' రచయిత విజయేంద్రప్రసాద్ ఈచిత్రానికి కథ అందించారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తోంది. శంకర్-ఎస్సాన్-లాయ్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కొంటెంట్ స్టూడియోస్ బేనర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

  రాణి లక్ష్మి భాయి

  రాణి లక్ష్మి భాయి

  ఝాన్సీకి రాణి లక్ష్మి భాయి అసలు పేరు మణికర్ణిక. మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె1828 లో వారణాసిలో జన్మించారు. అందుకే సినిమాను అక్కడి నుండే ప్రారంభించాలని నిర్ణయించిన క్రిష్ ఫస్ట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వారణాసిలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  క్రిష్ అదే ఫాలో అవుతున్నాడు

  క్రిష్ అదే ఫాలో అవుతున్నాడు

  క్రిష్ ఇంతకు ముందు తెరకె్క్కించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా విషయంలో కూడా అతడి జన్మస్థలం అయిన కోటి లింగాల నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో వారణాసిలోని గంగానది తీరంలో ‘మణికర్ణిక' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

  మూడు భాషల్లో...

  మూడు భాషల్లో...

  మణికర్ణిక చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తరహాలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు క్రిష్.

  రిలీజ్ డేట్

  రిలీజ్ డేట్

  2018 ఏప్రిల్ 27న ఈ మూవీ విడుదల కానుంది. అందుకు తగిన విధంగా సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు.

  English summary
  Kangana Ranaut was rushed to a hospital after a sword fight scene went wrong. The actor was shooting a sequence with co-star Nihar Pandya. In the scene, she was expected to duck when Nihar swung the sword at her, but because the timing was wrong, the sword hit her between her brows resulting in 15 stitches. The shooting happened in Hyderabad and the actor was taken to Apollo hospital and admitted at the ICCU.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more