»   » కారు అదుపుతప్పి చెట్టుకు, హీరోయిన్ కు గాయాలు

కారు అదుపుతప్పి చెట్టుకు, హీరోయిన్ కు గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై:బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం అట్లాంటాలో ఓ షూటింగ్ లో ఉంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నా 'సిమ్రన్' అనే చిత్రంలో నటిస్తోంది. అనూహ్యంగా ఆమె వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. వేగం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు రోడ్డుపక్కన ఉన్న ఫెన్సింగ్ ను ఢీకొంది. అయితే చిన్నచిన్న గాయాలతో కంగనా బయటపడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కంగనా తాజా చిత్రం 'సిమ్రన్‌' సినిమా షూటింగ్ లో కంగన రనౌత్‌ గాయపడిందట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అట్లాంటాలో జరుగుతోంది. ఈ నెల 12న షూటింగ్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ తిరిగి బస చేసిన హోటల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందట.

జార్జియా ప్రాంతంలో షూటింగ్ ముగించుకుని అట్లాంటాలో ఉన్న తన హోటల్ కు కారులో బయలుదేరింది కంగనా. స్థానిక డ్రైవరే కారు నడుపుతున్నాడు. అతడి పక్కన కంగనా బాడీగార్డ్ ఉన్నాడు. హైవే 381 మీద వేగంగా వెళ్తుండగా... డ్రైవర్కు దగ్గు వచ్చింది. కంట్రోల్ చేసుకోలేని స్థితిలో అతడు దగ్గుతూ ఉండగా వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పింది.

Kangana Ranaut 'miraculously' escapes unhurt in US road accident

వెంటనే పక్కనున్న కంగనా బాడీ గార్డు స్పందించి డ్రైవర్ చేతిలోని స్టీరింగ్ అందుకున్నాడు. కారు వేగాన్ని నియంత్రించే ప్రయత్నం చేశాడు. అయినా సరే హైవేని క్రాస్ చేసుకుంటూ పక్కనున్న ఫెన్సింగ్ ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కంగనా చేతికి చిన్నచిన్న గాయాలయ్యాయి. నుదిటిపై మరో చిన్న గాయమైంది.

బాడీగార్డు చాకచక్యంగా వ్యవహరించి స్టీరింగ్ తన చేతిలోకి తీసుకోవడంతో ప్రమాదం తీవ్రత తగ్గిందని అంటున్నారు. ఒక భారీ ప్రమాదం నుంచి కంగనా బయటపడిందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఆ కారులోనే ఉన్న చిత్ర యూనిట్ కి కూడా స్వల్ప గాయలయ్యాయని తెలుస్తోంది.

సిమ్రన్ విషయానికి వస్తే...బాలీవుడ్ తెర మీద నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆధరణ లభిస్తోంది. దీంతో ఎంతో మంది దర్శకనిర్మాతలు ఈ తరహా సినిమాలను తెరకెక్కించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటిగా మూడు సార్లు అవార్డు అందుకున్న బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్, ఈ తరహా సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది.

సిమ్రన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా, ఓ గుజరాతి ఎన్నారై నర్సు పాత్రలో కనిపిస్తోంది. గ్లామర్ షోకు ఏ మాత్రం వెనకాడని ఈ బ్యూటి.., సిమ్రన్ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా డీగ్లామర్స్ రోల్ లో నటిస్తోంది. జాతీయ అవార్డ్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, భూషణ్ కుమార్ శైలేష్ సింగ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

English summary
'Queen' actress Kangana Ranaut, who is currently filming for Hansal Mehta's 'Simran' in the US, recently miraculously escaped unhurt in a road accident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu