»   » 18 ఏళ్ల కుర్రాడితో ప్రభాస్ హీరోయిన్ రొమాన్స్

18 ఏళ్ల కుర్రాడితో ప్రభాస్ హీరోయిన్ రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ సరసన 'ఏక్ నిరంజన్' చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్....ఆ సినిమా ప్లాపు కావడంతో మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. అయితే ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో బిజీగా గడుపుతోంది. క్రిష్ 3 చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.

తాజాగా కంగన రనౌత్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తన రాబోయే సినిమా 'రాజ్జో'లో కంగన 18 ఏళ్ల కుర్రాడితో రొమాన్స్ చేయబోతోందట. విశ్వాస్ పాటిల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో కంగనా రనౌత్ ప్రొఫెషనల్ డాన్సర్‌గా కనిపించబోతోంది. ఇందులో ఆమె పాత్ర పేరు 'రాజ్జో'.

ఈ చిత్రంలో రాజ్జో 18 ఏళ్ల బ్రాహ్మణ కుర్రాడు చందు(పారస్ అరోరా)తో ప్రేమలో పడుతుంది. చందు తొలి చూపులోనే రాజ్జోను ప్రేమిస్తాడు. అయితే వీరి ఇద్దరి వేర్వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో ఇద్దరూ ఇబ్బందుల్లో పడతారు. వీరి ప్రేమ కథ ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది స్టోరీ. ఇటీవల విడుదలైన 'రాజ్జో' పోస్టర్‌లో కంగనా సెక్సీ లుక్‌కు మంచి స్పందన వచ్చింది.

ఈచిత్రంలో మహేష్ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 15, 2013లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్మాల్ బడ్జెట్ సినిమా అయిన రాజ్జో....అదే రోజు విడుదలవుతున్న 'రామ్ లీలా' చిత్రంతో పోటీ పడబోతోంది.

English summary

 In the recently released Krrish 3 song titled 'Dil Tu Hi Bataa', we witnessed Kangna Ranaut groove as she dinned bizarre outfits. This talented Bollywood actress is in for more surprises this year. In her upcoming movie Rajjo, Kangna will be seen romancing an 18-year-old boy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu