»   » తను నాకు లైంగికంగా రెచ్చగొట్టే మెయిల్స్‌ పంపింది: హృతిక్‌రోషన్‌

తను నాకు లైంగికంగా రెచ్చగొట్టే మెయిల్స్‌ పంపింది: హృతిక్‌రోషన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu
తను నాకు లైంగికంగా రెచ్చగొట్టే మెయిల్స్‌ పంపింది : హృతిక్‌రోషన్‌

బాలీవుడ్‌లో ప్రేమలు, ప్రణయాలు, వాటి చుట్టూ వదంతులు కొత్త కాదు. బాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌-హృతిక్‌రోషన్‌ల ప్రేమకథ ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. కానీ బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్‌, కంగనా రనౌత్‌ మధ్య 'ఎఫైర్‌' మాత్రం రచ్చకెక్కి హల్‌చల్‌ చేసింది పరస్పరం లీగల్ నోటీసులు పంపించుకునేదాకా వెళ్ళింది. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలకు తండ్రైన హృతిక్‌ను ప్రేమించిన కంగన ఈ ప్రేమకథతో తన పరువు పోగొట్టుకుంది. పోలీస్‌ కేసులు ఎదుర్కొంది, కోర్టు మెట్లు కూడా ఎక్కింది. బాలీవుడ్ అని కాదు మొత్తం దేశాన్నే ఒక కుదుపుకుదిపిందీ ప్రేమ వ్యవహారం.

 గత ఏడాది ఏప్రిల్‌లో

గత ఏడాది ఏప్రిల్‌లో

ఈ వివాదాన్ని ఈసారి రిపబ్లిక్‌ టీవీ తెరపైకి తెచ్చింది. కంగనపై గత ఏడాది ఏప్రిల్‌లో హృతిక్‌ లాయర్‌ మహేశ్‌ జఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెలికితీసి.. రిపబ్లిక్‌ టీవీ ప్రసారం చేసింది. హృతిక్‌ చేసిన ఈ ఫిర్యాదులో కంగనపై పలు తీవ్ర ఆరోపణలు ఉండటం గమనార్హం. కంగన తనను వెంటాడి... వేధించిందని, ఆమె నిత్యం తన వెంటపడేదని హృతిక్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కంగన తనకు లైంగికపరమైన ఈమెయిల్స్‌ పంపేదని, తనను ఆమె 'శాశ్వత ప్రేమికుడి'గా అభివర్ణించేదని తెలిపాడు.

'క్రిష్‌-3'

'క్రిష్‌-3'

2009లో 'కైట్స్‌' సినిమా ప్రారంభానికి ముందు కంగనను తొలిసారి కలిశానని, ఆ తర్వాత ఇద్దరం కలిసి 'కైట్స్‌' సినిమాలో నటించామని, 'క్రిష్‌-3' సినిమాలో కలిసి నటించినప్పటికీ ఆ తర్వాత తమ మధ్య స్నేహం లేదని హృతిక్‌ తెలిపాడు. 2009, 2013లో వృత్తిపరమైన కారణాల వల్లే తాను కంగనను పలుసార్లు కలిశానని, కానీ 2014లో ఆమె నుంచి అసభ్యమైన, దూషిస్తూ తనకు మెసేజ్‌లు వచ్చాయని హృతిక్‌ పేర్కొన్నాడు.

 హృతిక్‌ రేప్‌ చేశాడని

హృతిక్‌ రేప్‌ చేశాడని

అంతేకాకుండా కంగనను మానసికంగా, భావోద్వేగపరంగా హృతిక్‌ రేప్‌ చేశాడని ఆరోపిస్తూ.. ఆమె సోదరి రంగోళీ నుంచి కూడా మెయిల్‌ వచ్చిందని ఫిర్యాదులో తెలిపాడు.హృతిక్‌ను ఉద్దేశించి 'సిల్లీ ఎక్స్‌' అంటూ కంగనను అభివర్ణించడంతో ఇద్దరి మధ్య గొడవ చినికిచినికి లీగల్‌ పోరాటం వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

 సిమ్రన్‌

సిమ్రన్‌

తాజాగా 'సిమ్రన్‌' సినిమా ప్రమోషన్స్‌ సందర్భంగా కూడా కంగన ఈ వివాదంపై స్పందించింది. హృతిక్‌ ఫిర్యాదు పాతదేనని, టీఆర్పీ రేటింగ్స్‌ కోసమే రిపబ్లిక్‌ టీవీ దీనిని మళ్లీ వెలికితీసి ప్రసారం చేసిందని కంగన లాయర్‌ రిజ్వాన్‌ సిద్ధిఖీ విమర్శించారు. కంగన ఆ వివాదాన్ని దాటి ముందుకెళ్లిపోయిందని సోదరి రంగోళీ ట్వీట్‌ చేసింది. స్టాకర్‌ అంకుల్‌ ఇప్పటికైనా తన భార్యాపిల్లల మీద ఫోకస్‌ చేయాలంటూ హృతిక్‌ను చురకలు అంటించింది.

English summary
Hrithik Roshan accuses Kangana Ranaut of sending sexually explicit e-mails
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu