»   » ఫ్యామిలీపై దుమ్మెత్తి పోసిన ప్రభాస్ హీరోయిన్

ఫ్యామిలీపై దుమ్మెత్తి పోసిన ప్రభాస్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్‌కు జోడీగా 'ఏక్ నిరంజన్' చిత్రంలో నటించిన కంగనా రనౌత్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ప్లాపుకావడంతో అమ్ముడు మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం వరుస అవకాశాలతో దూసుకెలుతూనే ఉంది కంగనా. ప్రస్తుతం ఆమె తన తాజా బాలీవుడ్ మూవీ 'క్వీన్' చిత్రం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది.

తన ఫ్యామిలీ అంటే కంగనా రనౌత్‌కు అస్సలు పడదు. గతంలో పలు సార్లు కుటుంబ సభ్యులపై దుమ్మెత్తి పోసిన కంగనా...తాజాగా 'క్వీన్' మూవీ ప్రమెషన్స్ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మరోసారి తన కుటుంబ సభ్యుల పట్ల తనకు ఉన్న ద్వేషాన్ని, అయిష్టాన్ని వెల్లగక్కింది.

తాను చిన్నతనం నుండి కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, చాలా మంది పిల్లలు చిన్నతనంలో గారాబంగా పెరుగుతారు. కానీ నేను అలా పెరగలేదు. తాను సినిమాల్లోకి రావడం కూడా వారికి ఇష్టం లేదని, అందుకే కుటుంబానికి దూరంగా ఉంటున్నానని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.

'క్వీన్' సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రానికి వికాష్ బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కంగనా రనౌత్‌తో పాటు రాజ్ కుమార్ రావు, లీసా హెడెన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Kangna Ranaut, known for her outspoken nature recently said that she always ended up embarrassing her family on various occasions. She said that she was never pampered and was not the 'favourite' child in her family!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu