»   » ఆ స్టార్ హీరో ఇల్లు 22వ తేది కూల్చేస్తాం: ఐఏఎస్ అధికారి

ఆ స్టార్ హీరో ఇల్లు 22వ తేది కూల్చేస్తాం: ఐఏఎస్ అధికారి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కన్నడ చాలెంజింగ్ స్టార్, దర్శకుడు, నిర్మాత దర్శన్ కు మళ్లీ కష్టాలు మొదలైనాయి. కన్నడ హీరో దర్శన్ అక్రమంగా ఇంటిని నిర్మించారని, ఆ ఇల్లును తొలగిస్తామని బెంగళూరు నగర జిల్లాధికారి వి. శంకర్ స్పష్టం చేశారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హీరో దర్శన్ ఇల్లు, కర్ణాటక మాజీ మంత్రి శామనూరు శివశంకరప్పకు చెందిన ఎస్ఎస్ ఆసుపత్రి అక్రమంగా రాజకాలువ (మెయిన్ డ్రైనేజ్) మీద నిర్మించారని బీబీఎంపీ అధికారులు గుర్తించారని అన్నారు.

స్టార్ హీరో ఇల్లు కూల్చివేతకు ఏడు రోజులు గడువు

వారికి అక్రమ కట్టడాలు స్వచ్చందంగా తొలగించాలని ఇప్పటికే గడువు ఇచ్చామని, దర్శన్ తో పాటు మాజీ మంత్రి శివశంకరప్పకు చెందిన అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ఆయన వివరించారు. దర్శన్, శివశంకరప్ప కట్టడాలతో పాటు 69 అక్రమ కట్టడాలను ఈనెల 22వ తేది కూల్చివేస్తామని శంకర్ తెలిపారు.

 Darshan

బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ లోని ఐడిల్ హోం లేఔట్ లో దర్శన్ ఇల్లు ఉంది. 2,100 చదరపు అడుగుల డ్రైనేజ్ భూమిని ఆక్రమించి దర్శన్ ఇంటిని నిర్మించారని బీబీఎంపీ అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది.

మాజీ మంత్రి శామనూరు శివశంకరప్పకు చెందిన ఎస్ఎస్ ఆసుపత్రిని 22 గుంటల డ్రైనేజ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించానని వెలుగు చూసింది. వీరిద్దరి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి సిద్దం అయ్యామని తహశిల్దార్ శివకుమార్ ఇంతకు ముందే చెప్పారు.

English summary
The Bengaluru urban district authorities have decided to demolish on October 22, the Shamanur Shivashankarappa Hospital and Kannada film actor Darshan's house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu