»   »  చిక్కుల్లో రాకింగ్ స్టార్ యశ్: ఇంటి అద్దె బాకీపై కోర్టుకెక్కిన యజమాని

చిక్కుల్లో రాకింగ్ స్టార్ యశ్: ఇంటి అద్దె బాకీపై కోర్టుకెక్కిన యజమాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ మళ్లి వివాదంలో చిక్కుకున్నాడు. అతను నివాసం ఉంటున్న ఇంటికి గత నాలుగు సంవత్సరాల నుండి అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని కోర్టును ఆశ్రయించాడు. సుమారు రూ. 21 లక్షలకు పైగా అద్దె చెల్లించాలని ఇంటి యజమాని కోర్టును ఆశ్రయించాడు.

బనశంకరి మూడవ స్టేజ్ లోని మూడవ బ్లాక్ లో డాక్టర్ మునిప్రసాద్, డాక్టర్ వనజా దంపతులు( ఆంధ్రులు)కు చెందిన రెండు అంతస్తుల కట్టడంలో 2011 నుండి యశ్, అతని తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. ప్రతి నెల రూ. 40 వేలు అద్దె చెల్లిస్తామని అగ్రీమెంట్ చేసుకున్నారు.

అయితే ఒక సంవత్సరం అప్పుడప్పుడు అద్దె ఇచ్చేవారని, గత నాలుగు సంవత్సరాల నుండి ఒక నెల అద్దె ఇవ్వలేదని డాక్టర్ మునిప్రసాద్ పోలీసులను ఆశ్రయించారు. అద్దె చెల్లించాలని వెళ్లి అడిగితే తమ కోడుకు సినిమా హీరో, వేల మంది అభిమానులు ఉన్నారని, ఎక్కువగా మాట్లాడితే అంతు చూస్తారని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

Kannada Actor Yash is in news for not paying his house rent in Bangalore

ఇదే విషయం కన్నడ టీవీ చానెల్ లో చెప్పారు. చివరికి డాక్టర్ మునిప్రసాద్ దంపతులు న్యాయం చెయ్యాలని బెంగళూరు సిటి సివిల్ కోర్టును ఆశ్రయించారు. తమకు ఇప్పటి వరకు రూ. 21,37,972 అద్దె చెల్లించాలని, అద్దె ఇప్పించి వారిని ఖాళీ చెయ్యించాలని కోర్టును ఆశ్రయించారు.

ఇంటి అద్దె అగ్రిమెంట్ యశ్ తల్లి పుష్పా పేరు మీద ఉంది. కోర్టు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం పుష్పాకు నోటీసులు జారీ చేసింది. పుష్పా ఇంటిలో నియమాలు ఉల్లంఘించి చీటీల వ్యాపారం చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి.

అయితే సోమవారం మీడియాలో ఆ వార్తలు గుప్పుమనడంతో యశ్ తల్లి పుష్పా స్పందించారు. తాము ఒక సంవత్సరం నుండి ఇంటి అద్దె చెల్లించలేదని అన్నారు. తాము ఆంధ్రవాళ్లము, తమది చౌకబారు బుద్ధి అని తమను నిందిచడం వలనే అద్దె చెల్లించలేదని పుష్పా చెప్పారు. అద్దె చెల్లించడానికి తాము సిద్దంగా ఉన్నామని, అయితే ఇల్లు మాత్రం ఖాళీ చెయ్యమని పుష్పా తేల్చి చెప్పారు.

English summary
Kannada Actor Yash is in news for not paying his house rent. The issue is in City Civil Court. Meanwhile, Yash's mother Pushpa has reacted to the media. Read the article to know Pushpa's reaction.
Please Wait while comments are loading...