»   » డైరెక్టర్ వేధింపులతో హీరోయిన్ ఆత్మహత్యాయత్నం!

డైరెక్టర్ వేధింపులతో హీరోయిన్ ఆత్మహత్యాయత్నం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడ హీరోయిన్ వింద్య మంగళవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అధిక మోతాదులో నిద్ర మాత్రలు మిగడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయినట్ల పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. అసిస్టెంట్ డైరెక్టర్ మంజునాథ్ వేధింపులే వింద్య ఆత్మహత్యయత్నానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మనెదమరయల్లి అనే కన్నడ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన వింద్య అదే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మంజునాథ్‌తో స్నేహం చేసింది. ఈ క్రమంలో వీరి స్నేహం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే మంజునాథ్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని వింద్య తల్లిందండ్రులు రంగస్వామి, నాదమ్మ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమ కూతురుని మంజునాథ్ సిగరెట్లతో కాల్చేవాడని, ఆమపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచార.

Kannada actress Vindhya tried to commit suicide

మంజునాథ్ అసలు స్వరూపం తెలియడంతో వింద్య గత కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోందని, దీంతో మంజునాథ్ ఫోన్లో వేధించడం మొదలు పెట్టాడని, మంగళవారం ఉదయం అతని నుండి కాల్ రావడంతో మాట్లాడిన వింద్య అనంతరం గదిలోకి వెళ్లి ఏడ్చిందని, అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని తెలుస్తోంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం వింద్య కోమాలో ఉండటంతో....ఆమె కోలుకున్న తర్వాత స్టేట్‌మెంట్ తీసుకుని ఈ సంఘటన వెనక ఉన్న నిజా నిజాలు వెలికి తీయనున్నారు. సంద్య సన్నిహితులు, మనెదమరయల్లి చిత్రా దర్శక నిర్మాతలను పోలీసులు విచారిస్తున్నారు.

English summary

 Kannada actress Vindhya tried to commit suicide by swallowing almost 40 sleeping pills and is admitted in the hospital. The hospital authority has informed that, the condition of the actress is critical and she is in a coma stage at present.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu