»   » కంపెనీ యజమాని కిడ్నాప్: కన్నడ దర్శకుడు అరెస్టు: సినిమా ప్లాప్ తో మెంటల్ గా !

కంపెనీ యజమాని కిడ్నాప్: కన్నడ దర్శకుడు అరెస్టు: సినిమా ప్లాప్ తో మెంటల్ గా !

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: నగదు విషయంలో మనస్పర్థలు వచ్చి ఓ కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసిన కేసులో కన్నడ సినీ దర్శకుడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఎడరు కనసు ( రెండు కలలు) అనే కన్నడ సినిమా దర్శకుడు మదన్ ను శనివారం బెంగళూరు నగర శివార్లలోని దేవనహళ్లి సమీపంలో అరెస్టు చేశారు.

కన్నడ నటుడు విజయరాఘవేంద్ర, కారుణ్య రామ్ జంటగా నటించిన'ఎరడు కనసు'అనే కన్నడ సినిమాకు మదన్ దర్శకత్వం వహించాడు. ఈసినిమా ప్రచారం (ప్రమోషన్) కోసం దర్శకుడు మదన్ ప్రకటనల సంస్థ (యాడ్ ఏజెన్సీ) యజమాని పరమేశ్వర్ కు రూ. 16.30 లక్షలు ఇచ్చారు.

Kannada Eradu kanasu movie director Madan arrested under the kidnap Case.

రెండు నెలల క్రితం విడుదలైన ఎరడు కనసు సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదని సమాచారం. తాను డబ్బు ఇచ్చినా సినిమాకు సరైన రీతిలో ప్రచారం చెయ్యలేదని మదన్ కోపం పెంచుకున్నారు. తాను ఇచ్చిన సోమ్ములో రూ. 8 లక్షలు తిరిగి ఇవ్వాలని పరమేశ్వర్ కు చెప్పాడు.

నగదు తిరిగి ఇవ్వడానికి పరమేశ్వర్ అంగీకరించలేదు. ఈ విషయంలో మదన్ సహనం కోల్పోయి తన స్నేహితులతో కలిసి మరమేశ్వరన్ ను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. మా కుమారుడు మూడు రోజుల నుంచి ఇంటికి రావడం లేదని పరమేశ్వర్ తల్లిదండ్రులు మాగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం దేవనహళ్ళి సమీపంలో (బెంగళూరు అంతర్జాతీయ విమనాశ్రయం వద్ద) మదన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఎరడు కనసు సినిమా విడుదలై విజయం సాధించకపోవడంతో అప్పటి నుంచి అసహనానికి గురైన దర్శకుడు మదన్ కనిపించిన వారందరితో గొడవ పెట్టుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Kannada Actor Vijay Raghavendra starrer 'Eradu kanasu' movie director Madan arrested under the kidnap Case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu