Just In
- 3 min ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 18 min ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 1 hr ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
- 1 hr ago
జాకెట్ బటన్స్ విప్పేసి పాయల్ రాజ్‌పుత్ రచ్చ: ఎద అందాలతో కనువిందు చేస్తూ హాట్ వీడియో పోస్ట్!
Don't Miss!
- News
టీఆర్ఎస్ లో రసమయి వ్యాఖ్యల దుమారం ..తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ అసమ్మతి రాగం!!
- Sports
'కార్టూన్ బాయ్' రిషభ్ పంత్‌ను ట్రోల్ చేసిన రషీద్ ఖాన్!! ఏమన్నాడంటే?
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు... ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న తొలి మహిళా పైలట్ స్వాతి రాథో
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Automobiles
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాలీవుడ్‌లోకి మరో పవర్ స్టార్ ఎంట్రీ: ట్విట్టర్ ద్వారా ప్రకటించిన హీరో
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మరో పవర్ స్టార్ రాబోతున్నాడు. అవును.. మీరు చదివింది నిజమే. పవర్ స్టార్ అనే బిరుదుతో ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీలలో హీరోలు ఉన్నారు. వాళ్లంతా తమ తమ భాషల్లో స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ జాబితాలోకే వస్తాడు కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్. తెలుగులో పవన్ కల్యాణ్‌ను అభిమానులు ఎంతలా ఆరాధిస్తారో.. అదే రీతిలో శాండిల్‌వుడ్‌లో పునీత్‌ను అభిమానిస్తుంటారు ఆయన ఫ్యాన్స్. ఈ హీరో త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
'KGF' సినిమాను నిర్మించిన హోంబళే ఫిలిమ్స్ సంస్థ తెరకెక్కిస్తోన్న చిత్రం 'యువరత్న'. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సంతోష్ అనంద్‌రామ్ తెరకెక్కించాడు. సాయేషా సైగల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు హీరో పునీత్ ట్విట్టర్ ద్వారా పోస్టర్‌ను విడుదల చేశాడు. తెలుగులో విడుదల కాబోతున్న మొదటి చిత్రం కావడంతో అందరి మద్దతు కావాలని ఈ ట్వీట్‌లో కోరాడతను.

సీనియర్ హీరో రాజ్‌కుమార్ తనయుడైన పునీత్.. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే నేషనల్ అవార్డును సైతం అందుకున్నాడు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'అప్పు'తో హీరోగా పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి వరుసగా విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. వీటిలో చాలా వరకు తెలుగు సినిమాల రీమేక్‌లు సైతం ఉన్నాయి. పునీత్ డ్యాన్స్‌లోనూ ఇరగదీసేస్తుంటాడు. అలాగే, సింగర్‌గానూ ఎన్నో సినిమాల్లో పాటలు పాడాడు. అందుకే కన్నడ సినీ పరిశ్రమలో అతడు పవర్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు.