Don't Miss!
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Finance
Pharma Mutual Funds: ఫార్మా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
ప్రముఖ కన్నడ సీరియల్ నటి, నటుడు దుర్మరణం: పార్క్ చేసిన ట్యాంకర్ ను కారు ఢీకొని !
బెంగళూరు: పుణ్యక్షేత్రానికి వెళ్లి బెంగళూరు తిరిగి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ టీవీ సీరియల్ ప్రముఖ నటీ, నటుడు దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని మాగడి తాలుకా సోలూరు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలైనాయి.
మహానది, త్రివేణి సంగమ, మధుబాల తదితర సూపర్ హిట్ సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషించిన నటి రచనా (23), నటుడు జీవన్ (25) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్ అనే యువకులకు తీవ్రగాయాలై హర్షా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.

కార్తిక్ పుట్టిన రోజు సందర్బంగా బుధవారం అందరూ బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కుక్కేసుబ్రమణ్య దేవస్థానంకు వెళ్లారు. అక్కడే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్తిక్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

గురువారం వేకువ జామున సఫారీ కారులో అందరూ బెంగళూరు బయలుదేరారు. మార్గం మధ్యలో మాగడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి 48లో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను సఫారీ కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో నటి రచనా, నటుడు జీవన్ దుర్మరణం చెందారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వారిని స్థానికులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితులను 108 వాహనాల్లో హర్షా ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను ఢీకొన్నారా ? లేక ఆకస్మికంగా ప్రమాదం జరిగిందా ? అని దర్యాప్తు చేస్తున్నామని కుదూరు పోలీసులు తెలిపారు.