»   » కపిల్, సల్మాన్ కొసం నెట్ సెర్చ్ చేయొద్దు: జాగ్రత్త..! ప్రమాదం లో పడ్డట్టే

కపిల్, సల్మాన్ కొసం నెట్ సెర్చ్ చేయొద్దు: జాగ్రత్త..! ప్రమాదం లో పడ్డట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభిమానం తో వాళ్ళిద్దరి పేర్లూ ఇంటర్నెట్ లో గనక సెర్చ్ చేసారంటే మీరు ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారన్నమాటే. ఇంతకీ ఎవరా ఇద్దరు ప్రముఖులు? వాళ్ళ పేర్లు గూగుల్ లో సెర్చ్ చేస్తే వచ్చే రిస్కేమిటీ అనుకుంటున్నారా?? ప్ర‌ముఖ‌ క‌మెడియ‌న్ క‌పిల్ శ‌ర్మ‌, బాలీవుడ్‌ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ పేర్ల‌ను ఇంట‌ర్నెట్లో సెర్చ్ చేస్తే ప్ర‌మాద‌క‌ర వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ వెల్ల‌డించింది.

ఆ సైట్ ని ఓపెన్ చేసారంటే ప్రమాదం లో పడ్డట్టే

ఆ సైట్ ని ఓపెన్ చేసారంటే ప్రమాదం లో పడ్డట్టే

అంటే వీళ్ల ఇద్దరి పేర్లమీదా మీ ఎలక్ట్రానిక్ గాడ్గెట్లమీద దాడి చేసే ప్రమాదకర వైరస్ ఉన్న వెబ్ సైట్లని తయారు చేసి ఉంచుతారన్న మట ఇక మీరు ఆ సైట్ ని ఓపెన్ చేసారంటే ప్రమాదం లో పడ్డట్టే. ఇంట‌ర్నెట్లో రిస్కీయెస్ట్‌ సెల‌బ్రిటీల జాబితాను ఈ సంస్థ ప్ర‌క‌టించింది.

Gulf Movie Official Trailer గల్ఫ్ సినిమా ట్రైలర్
మోస్ట్ సెన్సేష‌న‌ల్ సెల‌బ్రిటీస్‌

మోస్ట్ సెన్సేష‌న‌ల్ సెల‌బ్రిటీస్‌

"మోస్ట్ సెన్సేష‌న‌ల్ సెల‌బ్రిటీస్‌" పేరుతో ఈ రిస్కీ వెబ్ సైట్లు ఉండే సెలబ్రిటీల జాబితాను విడుద‌ల చేసింది. చాలామందే ఉన్నా ఇందులో క‌పిల్‌, స‌ల్మాన్‌లు మొద‌టి రెండు స్థానాల్లో నిలిచారు. క‌పిల్ శ‌ర్మ గురించి వెతికితే 9.58 శాతం వైర‌స్‌ను వ్యాపించే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది.

గ‌త ఏడాది మొద‌టి స్థానంలో సోనాక్షి సిన్హా

గ‌త ఏడాది మొద‌టి స్థానంలో సోనాక్షి సిన్హా

అలాగే స‌ల్మాన్, ఆమిర్ ఖాన్‌ల గురించి సెర్చ్ చేస్తే 9.03 శాతం, 8.89 శాతం ప్ర‌మాద‌క‌ర సైట్ల‌ను ఓపెన్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. గ‌తేడాది ఈ జాబితాలో మొద‌టి స్థానంలో సోనాక్షి సిన్హా ఉండేది. ఈసారి టాప్ 10 రిస్కీ సెల‌బ్రిటీల్లో ఆమె పేరు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా

నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా

ఇంకా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా ఉన్నారు. అనుష్క శ‌ర్మ‌, స‌న్నీ లియోన్, కంగ‌నా ర‌నౌత్‌, ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌, టైగ‌ర్ ష్రాఫ్‌లు త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు. వీరి గురించి ఇంట‌ర్నెట్లో సెర్చ్ చేసేముందు ఒకసారి ఆలోచించ‌డని మెకాఫీ సంస్థ ప్ర‌తినిధి వెంక‌ట్ క్రిష్ణాపూర్ తెలిపారు.

English summary
Comedian and actor Kapil Sharma and Salman Khan are emerged as the most sensational celebrity to search for online in 2017, according to a study by McAfee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu